హోమ్ / వంటకాలు / అక్కి రొట్టి (బియ్యం పిండి రొట్టెలు)

Photo of RICE FLOUR ROTI by Rashmi SudhiMurthy at BetterButter
774
2
0.0(0)
0

అక్కి రొట్టి (బియ్యం పిండి రొట్టెలు)

Jan-11-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అక్కి రొట్టి (బియ్యం పిండి రొట్టెలు) రెసిపీ గురించి

ఈ రొట్టెలు కర్ణాటక లో చాలా ఫేమస్.ఇందులోకి ఆకుకూరలు సన్నగా తరిగి వేసుకోవచ్చు.ఇది క్రిస్పీ గా చేసుకుంటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కర్ణాటక
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 2 కప్పులు
  2. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్
  3. కొత్తిమీర తరుగు 1/4 కప్
  4. పచ్చిమిర్చి 2
  5. కరివేపాకు 4
  6. పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. వేడి నీళ్ళు 2 కప్పులు( తగినంత)
  9. వేరు శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు
  10. ఆవాలు 1/4 టీ స్పూన్
  11. మినప్పప్పు 1/4 టీ స్పూన్
  12. జీలకర్ర 1/8 టీ స్పూన్
  13. నూనె 1 టేబుల్ స్పూన్ ( పిండిలో పోపు కోసం)

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. ఒక బేసిన్ లో బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము,ఉప్పు వేసి ఒక సారి కలపాలి
  3. ఇప్పుడు పోపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు,మినప్పప్పు, జీలకర్ర, కొంచెం దంచిన వేరుశెనగ పప్పు వేసి ఫ్రై చేయాలి
  4. ఈ పోపుని పిండిలో కలిపి వేడి(వెచ్చగా ఉన్నా చాలు) నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి.పిండి మరీ పల్చగా లేదా గట్టిగా ఉండకూడదు
  5. ఇప్పుడు చేతిలో కొంచెం పిండి తీసుకుని నాన్ స్టిక్ పెనం పైన చేతితో తట్టాలి
  6. ఇప్పుడు స్టవ్ వెలిగించి రొట్టి తట్టిన పెనం పెట్టి నూనె వేసి రొట్టెను రెండు వైపులా కాల్చాలి
  7. ఎంత పల్చగా తడితే రొట్టి అంత కరకరలాడుతుంది
  8. వేడి వేడి రొట్టెలు చట్నీ లేదా పప్పు వేసుకొని తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర