హోమ్ / వంటకాలు / కోవా కరియలు /కజ్జికాయలు

Photo of mawa gujiya by kalyani shastrula at BetterButter
897
2
0.0(0)
0

కోవా కరియలు /కజ్జికాయలు

Jan-11-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవా కరియలు /కజ్జికాయలు రెసిపీ గురించి

గోధుమ పిండి ,కోవాతో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 10

  1. రెండు కప్పుల గోధుమపిండి
  2. పావు కప్పుకంటే సగం బియ్యంపిండి
  3. చిటికెడు ఉప్పు
  4. మూడు స్పూన్ ల నువ్వుల పొడి
  5. చిటికెడు సోడా
  6. పావుకిలో కోవా
  7. కప్పు బెల్లం చూసి కొద్దిగా అటూ ఇటూ
  8. చిటికెడు ఇలాయిచిపొడి ,
  9. కప్పు కొబ్బరి తురుము
  10. నూనె /నెయ్యి డీప్ ఫ్రై కి సరిపడా
  11. రెండు స్పూన్ ల వేడి నూనె

సూచనలు

  1. మొదలు గోధుమపిండితో కొద్దిగా బియ్యంపిండి చిటికెడు ఉప్పు ,సోడా ,రెండు స్పూన్ల వేడి నూనె వేసి కలిపి ,కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండి వలె కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి .
  2. ఇప్పుడు ఒక మూకుడులో పచ్చి కోవా వేసి చిన్న మంటమీద ఉంచి కలుపుతూ ఉండాలి .
  3. పొడిపొడిగా అవుతున్నప్పుడు పచ్చికొబ్బరి కూడా వేసి బాగా వేయించాలి
  4. అదికూడా కొద్దిగా వేగాక తరిగిన బెల్లం ,ఇలాయిచి పొడి వేసి వేగనివ్వాలి
  5. ఇప్పుడు నువ్వుల పొడికూడా వేసి బాగా వేగనివ్వాలి .దగ్గరగా అయ్యేవరకు వేయించాలి
  6. ఇలా అయిన దాన్ని కొబ్బరి కోవా హల్వా అంటారు .ఇప్పుడు గోధుమపండిని పెద్ద చపాతీ వలె ఒత్తుకొని ఏదైనా అంచులేని గిన్నెతో ఒత్తితే అన్నీ ఒకటే సైజు లో రొట్టెలు వస్తాయి .
  7. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి
  8. ఇప్పుడు ఒక్కొక్క చిన్న చపాతీలో తయారు చేసుకున్న హల్వా పెట్టి రెండు చివరలు సమానంగా కలపాలి
  9. ఎడమ చేతిలో దీనిని పట్టుకొని కుడి చేతితో చివర నుండి అల్లుకుంటూ రావాలి .అల్లడం రానివాళ్లు మౌల్డ్ లో పెట్టి ఒత్తుకోవచ్చు .
  10. వీటన్నింటిని చక్కగా అల్లుకొని పెట్టుకున్నాక ,మూకుడులో నూనె /నెయ్యి వేసి వేడి చేయాలి .
  11. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని కాగుతున్న నూనెలో గోలించుకోవాలి
  12. నూనెను బట్టి రెండు మూడు వేసుకోవచ్చు
  13. రెండు వైపులా చక్కగా వేగాక తీసుకోవాలి .ఎంతో క్రిస్పీగా ,చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర