హోమ్ / వంటకాలు / చిరోటి స్వీట్

Photo of Chiroti sweet by kalyani shastrula at BetterButter
1330
4
0.0(0)
0

చిరోటి స్వీట్

Jan-11-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిరోటి స్వీట్ రెసిపీ గురించి

గోధుమ పిండితో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. రెండు కప్పుల గోధుమ పిండి
  2. పెద్ద స్పూన్ మైదా
  3. నాలుగు స్పూన్ ల బియ్యంపిండి
  4. రెండు స్పూన్ ల బొంబాయి రవ్వ
  5. చిన్న గంటెడు వేడి నూనె
  6. చిటికెడు సోడా
  7. చిటికెడు ఉప్పు
  8. గోలించడానికి సరిపడా నూనె
  9. చెక్కర పొడి ఒక కప్
  10. చెక్కర రెండు కప్పులు
  11. ఇలాయిచి పొడి తగినంత

సూచనలు

  1. మొదలు గోధుమ పిండిలో కొద్దిగా మైదా బొంబాయి రవ్వ ,చిటికెడు ఉప్పు ,సోడా చిటికెడు ,కొద్దిగా వేడి నూనె లేదా నెయ్యి వేసి కలిపి ,కొద్దిగా నీళ్లు/ఆవుపాలు పోసి చపాతీ పిండివలె కలిపి ఉంచుకోవాలి .(అచ్చం చిరోటి రవ్వతో చేయవచ్చు .లేదా మైదా లో బొంబాయి రవ్వ కలిపి చేయవచ్చు .కాకపోతే మైదా మంచిది కాదు )
  2. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్ ల బియ్యంపిండిలో ఆవునెయ్యి కాని నూనె కాని వేసి పలచగా కలిపి పక్కన పెట్టుకోవాలి .
  3. ఇప్పుడు పిండిని తీసుకొని చపాతీ వలె ఒత్తుకోవాలి .దానిమీద బియ్యంపిండి పేస్ట్ పూయాలి
  4. ఇప్పుడు దీని మీద మరొక చపాతీ పెట్టి మళ్లీ బియ్యంపిండి పేస్ట్ పూయాలి .ఇలా మూడు చపాతీలు పెట్టాలి .
  5. ఇప్పుడు దీనిని చాప చుట్టినట్టు చుట్టుకొని చివరలో కట్ చేసి ,మొత్తం ను చిన్న సమానమైన ముక్కలుగా కట్ చేయాలి
  6. ఒక్కొక్క ముక్కను తీసుకొని చపాతీ కర్రతో సున్నితంగా ప్రెస్ చేయాలి
  7. ఇవి రెడీ చేసుకోగానే పక్కన తీగ పాకం చేసుకోవాలి .ఇది గోరువెచ్చగా ఉండాలి .ఇందులో నూనెలో గోలించిన వేడివేడి చిరోటీలను డిప్ చేసి తీయాలి
  8. నూనెలో గోలించిన చిరోటీలు
  9. పాకంలో డిప్ చేసినవి
  10. కొన్ని నూనెలో వేయించినవి పక్కనపెట్టుకోవాలి
  11. వీటి పైన చక్కర పొడి ఇలాయిచి పొడి చల్లాలి
  12. రెండురకాలయిన పాకం చిరోటీలు ,చెక్కరపొడి చల్లిన చిరోటీలు చాలా రుచిగా ఉంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర