హోమ్ / వంటకాలు / పాటిషప్త పీఠ.

Photo of PATISHAPTA   by Shobha.. Vrudhulla at BetterButter
589
6
0.0(0)
0

పాటిషప్త పీఠ.

Jan-11-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాటిషప్త పీఠ. రెసిపీ గురించి

యిది బెంగలిస్వీట్ డిష్.చాలా రుచిగా ఉంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • పశ్చిమ బెంగాల్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. దోసెలు కి సామాన్లు :
  2. వరిపిండి2 కప్పులు
  3. మైదా అర కప్పు
  4. ఉప్పు తగినంత
  5. బెల్లము కరిగించినది 2 పెద్ద చెంచాలు
  6. నీళ్లు తగినన్ని
  7. స్వీట్ చేయటానికి :
  8. పాలు బాగా క్రీమ్ ఉన్నవి 1 లీటరు
  9. చల్లటి పాలు అర కప్పు
  10. వరిపిండి2 పెద్ద స్పూన్లు
  11. బెల్లం కరిగించినది 3 to 4 పెద్ద స్పూన్లు
  12. యాలుకల పొడి అర చెంచా

సూచనలు

  1. ముందుగా దోసెల కోసం పిండి కలుపుకోవాలి. వరిపిండి,మైదా,ఉప్పు మరియు బెల్లం వేసి ముందు ఒకసారి అన్ని కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా దోసల పిండి గా కలపాలి.
  2. కలిపిన తరువాత 20 నిమిషాలు వరకు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి పొంగిన తరువాత బాగా దగ్గర పడే దాకా మరగనివ్వాలి
  4. దగ్గర పడ్డాక అరకప్పు పాలల్లో వరిపిండి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలల్లో కలుపుతూ పోయాలి .
  5. అందులో మరిగి ఉంచిన బెల్లం మరియు యాలకలపొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి . ముద్దగా అయ్యే వరకు . బాగా ముద్ద అయ్యాక కిందకు దించేయవలెను.
  6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక తగ్గించి పెనం మీద నెయ్య వేసి స్ప్రెడ్ చేసాక ముందుగా ఉంచిన దోసెల పిండిని ఒక్క గరిటెడు మాత్రమే వేసి గరిటె తో కాకుండా పెనం పట్టుకొని అటు ఇటు తి ప్పాలి దానంతట అదే స్ప్రెడ్ అయే లాగా
  7. ఆ దోసలు పూర్తిగా కాలక ముందే దాని మీద ముందుగా పాలతో చేసిన స్వీట్ ని దోస మీద పెట్టాలి కింద పిక్ లో చూపించినట్టు
  8. ఇప్పుడు దాన్ని కప్పుతూ చుట్టుకుంటూ రోల్ లా చేయాలి.
  9. దోస ఎక్కువ కాలకుండా వెంటనే రోల్ చుట్టాలి విరగా కుండా.
  10. పీఠ తయారు.
  11. ఇది విరిగి పోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి.స్వీట్ రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర