హోమ్ / వంటకాలు / సొరకాయ సర్వపిండి.

Photo of Bottle gourd sarvapindi by దూసి గీత at BetterButter
931
5
0.0(0)
0

సొరకాయ సర్వపిండి.

Jan-18-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ సర్వపిండి. రెసిపీ గురించి

తెలంగాణ ప్రాంతానికి చెందిన అతిముఖ్యమైన ఆహార పదార్థము.ఏపండగైనా,ప్రత్యేక సందర్భమైనా తెలంగాణ వాసులు చేసుకునే వంటకం.ఈ సర్వపిండిని రకరకాల పదార్థాలు మేళవించి చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వరిపిండి : 2 కప్పులు.
  2. సొరకాయ తురుము : 1 కప్పు.
  3. పచ్చిమిర్చి,అల్లం తరుగు : 1 చెంచా.
  4. నువ్వుల పప్పు : 2 చెంచాలు.
  5. వేరుశనగ పప్పు : 2 చెంచాలు.
  6. కరివేపాకు, కొత్తిమీర 1/4 కప్పు.
  7. ఉప్పు : 1/2 చెంచా.
  8. ఖారం : 1/4 చెంచా.
  9. ఇంగువ : చిటికెడు.
  10. నూనె 1/4 కప్పు.

సూచనలు

  1. ముందుగా సొరకాయ తురిమి పెట్టుకోవాలి. మిగిలిన దినుసులన్నీ సిద్ధం చేసుకోవాలి.
  2. వరిపిండిలో సొరకాయ తురుము వేసుకోవాలి.
  3. మిగిలిన వన్నీ కూడా ఒక్కొక్కటీ వెయ్యాలి
  4. అవసరమైనన్ని నీళ్ళు పోస్తూ మృదువైన పిండి కలుపుకోవాలి.
  5. మూకుడులో( స్టౌ వెలీగించకుండా చల్లని మూకుడులో నే) కాస్త నూనె వేసి, పిండి లో నుండీ బత్తాయి కాయంత ముద్ద తీసుకుని, పలుచగా పరవాలి. అక్కడక్కడా వేలితో కన్నాలు చెయ్యాలి. అప్పుడు స్టౌ వెలిగించి, రొట్టె పై చేసిన కన్నాలలో నూనె వేసుకోవాలి.
  6. మూత పెట్టి సన్నటి మంట పై ఎర్రగా కాల్చుకోవాలి. ఈ సర్వపిండిని, పెనం పైన కూడా కాల్చుకోవచ్చు. నేను ఇవాళ ఒకటి మూకుడులో,ఒకటి పెనంపైనా కాల్చాను‌
  7. రొట్టె కాలడానికి పది నిమిషాలు పడుతుంది. కాలిన రొట్టెను వేడిగా వడ్డిస్తే నే బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర