హోమ్ / వంటకాలు / గోధుమపిండి బిస్కెట్లు

Photo of wheatflour biscuits by Chandrika Marripudi at BetterButter
32
2
0.0(0)
0

గోధుమపిండి బిస్కెట్లు

Jan-22-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి బిస్కెట్లు రెసిపీ గురించి

గోధుమపిండి, పంచదారపొడి,గుడ్లు కలిపి ముద్దలా చేసి బిస్కెట్లు చేసి బేక్ చేసుకోవాలి. టీ టైంకి చాలా బాగుంటాయి కరకరగా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • బేకింగ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. గోధుమపిండి : 2 కప్పులు
  2. పంచదారపొడి : 1కప్
  3. గుడ్లు : 4
  4. పాలు : చిన్న కప్
  5. బేకింగ్ పౌడర్ : 1 టేబుల్ స్పూన్
  6. నెయ్యి : 4 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ఒక గిన్నెలో గోధుమపిండి,గిలకొట్టిన గుడ్డు మిశ్రమం, పంచదారపొడి, బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  2. కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి.
  3. పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేతితో వత్తుకుని చాకుతో చిన్నగా పైన నచ్చినట్లు గాట్లు పెట్టుకోవాలి.
  4. అర్ధచంద్రాకారంగా,రౌండ్ గా మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు.
  5. ఇడ్లీ పాత్రలో లేదా కుక్కర్ లో అడుగున ఇసుక పోసి వేడి చేసుకోవాలి.
  6. తయారు చేసిన బిస్కెట్లును ఒక ప్లేటు లేదా గిన్నెలో పేర్చుకుని ఇసుక పైన పెట్టి మూత పెట్టి చిన్న మంట మీద బేక్ చేసుకోవాలి.
  7. మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పి బేక్ చేసుకోవాలి.
  8. 15 నుండి 20 నిమిషాలు లో తియ్యని కరకరగా ఉండే బిస్కెట్లు రెడీ.
  9. చల్లారాక డబ్బాలో వేసి మూత పెట్టుకుని టీటైంలో తినొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర