చేగోడీలు | chegodilu Recipe in Telugu

ద్వారా Lakshmi Varun  |  22nd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of chegodilu by Lakshmi Varun at BetterButter
చేగోడీలుby Lakshmi Varun
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

6

0

చేగోడీలు వంటకం

చేగోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make chegodilu Recipe in Telugu )

  • మైదా : 1కప్పు
  • బియ్యంపిండి : 3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు : తగినంత
  • వాము : 2 స్పూనులు
  • నెయ్యి : 3 స్పూనులు
  • కారం : 1/2 టీస్పూను
  • పసుపు : కొద్దిగా
  • నూనె : వేయించాడానికి సరిపడా
  • నీళ్లు : 1 కప్పు

చేగోడీలు | How to make chegodilu Recipe in Telugu

  1. ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి బాగా వేడి అయినా తరువాత వాము,నెయ్యి,పసుపు,తగినంత ఉప్పు వేసి మరిగిన తరువాత మంట తగ్గించి మైదాపిండి,బియ్యంపిండి వేసి బాగా కలుపుకొని కొంచెం గట్టిపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొంచెం గోరు వెచ్చగా చల్లర్చుకోవాలి..
  2. తరువాత పిండిని చేతితో బాగా కలుపుకుంటు మర్దన చేసుకోవాలి...అప్పుడు పిండి సాఫ్ట్ గా తయారు అవుతుంది...
  3. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేతితో పొడవుగా తాలికలు గా చేసుకొని చివరలు అతికించుకుంటు ఒక రింగ్ లాగా చేసుకోవాలి...అన్ని ఇలానే చేసుకొని సిద్దంగా ఉంచాలి..
  4. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి నూనె వేసి వేడి అయిన తర్వాత చేగోడీలను వేయించుకోవాలి...
  5. అంతే చేగోడీలు రెడీ...గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే ఇవి 1 వారం రోజులు నిల్వ ఉంటాయి...

Reviews for chegodilu Recipe in Telugu (0)