నేతి మైసుర్ పాక్ | Ghee Mysore Pak / Soft Mysore Pak Recipe in Telugu

ద్వారా Lakshmi Varun  |  24th Jan 2019  |  
3 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ghee Mysore Pak / Soft Mysore Pak recipe in Telugu,నేతి మైసుర్ పాక్, Lakshmi Varun
నేతి మైసుర్ పాక్by Lakshmi Varun
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

19

1

నేతి మైసుర్ పాక్ వంటకం

నేతి మైసుర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ghee Mysore Pak / Soft Mysore Pak Recipe in Telugu )

 • శెనగపిండి : 200గ్రా"
 • పంచదార : 250గ్రా"
 • నెయ్యి : 250గ్రా"
 • నీళ్లు : తగినంత

నేతి మైసుర్ పాక్ | How to make Ghee Mysore Pak / Soft Mysore Pak Recipe in Telugu

 1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి అయినా తరువాత శెనగపిండిని వేసి పచ్చి వాసన పోయేవరకు ఒక 5, 10 నిమిషాలు సిమ్ లో పెట్టి వేయించుకోవాలి...
 2. నెయ్యిని వేడి చేసుకుని సిద్దంగా ఉంచుకోవాలి...
 3. వేయించిన శెనగపిండిని గడ్డలు లేకుండా జల్లెడ పట్టాలి...ఇప్పుడు మనకి మెత్తటి శెనగపిండి వస్తుంది...
 4. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మందపాటి కలాయి లేదా పాన్ పెట్టి పంచదార,తగినన్ని నీళ్ళు వేసుకొని తీగ పాకం కాకుండా ముదురు పాకం కాకుండా మద్యస్తంగా పాకం పట్టుకోవాలి...
 5. ఈలోపు ఒక గిన్నెలో కొంత నెయ్యిని వేసుకుని అందులో వేయించుకున్న శెనగపిండిని వేసి ఉండలు లేకుండా గరిటతో బాగా కలుపుకోవాలి...
 6. పాకం తయారు అయిన తరువాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని శెనగపిండి మిశ్రమాన్ని పాకంలో వేసుకోని కలుపుతూ ఉండాలి....
 7. 2 నిమిషాల్లో శెనగపిండి పాకంలో కలిసిపోయి దగ్గర పడుతూ ఉన్నప్పుడు మిగతా నెయ్యిని రెండు నిమిషాలకు ఒక్కసారి కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి...నెయ్యి నీ అలా రెండు,మూడు సార్లు వేసుకోవాలి...
 8. పిండి ఇలా బాగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి...
 9. తరువాత నెయ్యి రాసిన ప్లేటులోకి తయారు చేసుకున్న మైసుర్ పాక్ తీసుకోని , ఒక స్పూన్ కి నెయ్యి రాసుకుని దానితో అంత సర్దుతూ ఒత్తు కోవాలి...
 10. ఒక 10 నిమిషాలకి కొంచెం చల్లారిన తరువాత చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి...అప్పుడే ఆరిన తరువాత ముక్కలు బాగా వస్తాయి...
 11. ఇంకో 10 నిమిషాలు ఆగి వేరే ప్లేట్ లోకి బొర్లించుకుని ప్లేట్ పైన కొంచెం తట్టితే మైసుర్ పాక్ ప్లేట్ లోకి పడుతుంది...
 12. తరువాత ముక్కలుగా విడదిసుకోని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి...
 13. అంతే ఎంతో రుచికరమైన సాఫ్ట్ గా ఉండే నేతి మైసుర్ పాక్ రెడీ....ఇవి వారం,పది రోజులు నిల్వ ఉంటాయి....

Reviews for Ghee Mysore Pak / Soft Mysore Pak Recipe in Telugu (1)

Gadige Maheswari2 months ago

సూపర్ :yum:
జవాబు వ్రాయండి