హోమ్ / వంటకాలు / స్పైసి వెజిటబుల్ ఫ్రైడ్ పయ్

Photo of Spicy vegetable fried pie by Pravallika Srinivas at BetterButter
49
4
0.0(0)
0

స్పైసి వెజిటబుల్ ఫ్రైడ్ పయ్

Jan-26-2019
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసి వెజిటబుల్ ఫ్రైడ్ పయ్ రెసిపీ గురించి

ఈ అల్పాహారం ని గోధుమపిండి తో చేసినది.లోపల మనకు నచ్చిన కూరలతో స్టూఫిన్గ్ చేస్కోవచ్చు.సాదరణంగా మైదా వాడతారు ఎలాంటి వాటికి దానికి బదులు గోధుమపిండి వాడాను.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • భారతీయ
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • దోరగా వేయించటం
 • వేయించేవి
 • చిరు తిండి
 • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

 1. గోధుమపిండి - పెద్ద కప్పు
 2. బొంబాయి రవ్వ - 4 స్పూన్లు
 3. వెన్న - 4 స్పూన్లు
 4. క్యారెట్ తరుగు సన్నగా తరిగినది - 1
 5. క్యాబేజీ - చిన్నముక్క సన్నగా తరిగినది
 6. క్యాప్సికమ్ - 1 సన్నగా తరిగినది
 7. ఉల్లితరుగు - 1 సన్నగా తరిగినది
 8. కాశ్మీరీకారం - 1 స్పూను
 9. టమాటో ఫ్యూరీ - 1 స్పూను
 10. ఉప్పు- అర స్పూను
 11. వెజిటబుల్ మసాలా - 1 స్పూను
 12. ఆలివ్ నూనె - 1 స్పూను కూర చేయడానికి
 13. నూనె - డీప్ఫ్రై సరిపడా
 14. నీరు - పిండి కలపడానికి సరిపడా

సూచనలు

 1. ముందుగా ఒక బేషన్లో గోధుమ పిండి,బొంబాయి రవ్వ,చిటికెడు ఉప్పు వేసి రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్న వేసి కలుపుకోవాలి.
 2. పైనుండి తగినన్ని నీరు వేసి గట్టిగా కలుపుకోవాలి.దీనిని మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
 3. ఈలోగా కూరలు అన్ని సన్నగా తరిగి సిద్ధం చేసుకోవాలి.
 4. ఇప్పుడు ఒక కళాయిలో 1 స్పూన్ ఆలివ్నూనె వేసి సోంపు వేసి చిటపాటలాడాకా కూరగాయలు ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి.
 5. మగ్గిన కూరముక్కల్లో ఉప్పు,కారం,వెజిటబుల్ మసాలా,టమాటో ఫ్యూరీ అన్ని వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
 6. ఇప్పుడు ముందుగా కలిపిన పిండి తీసుకొని పల్చటి పూరీలు సమానమైన సైజులో వత్తుకోవాలి.
 7. ఇప్పుడు చల్లారిన కూరను మధ్యలో పెట్టి చివర్లు నీరు రాసి పైన మరొక పూరీని పెట్టుకొని సీల్ చేసుకోవాలి.
 8. ఇప్పుడు మరొక పూరీని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి.
 9. కింద చూపిన విధంగా మత్ లాగా సెట్ చేసి పైన పరుచుకోవాలి.
 10. అన్ని ఇలాగే పెట్టిన తర్వాత ఇలాగ కనిపిస్తుంది
 11. చివర్లు కట్ చేసి ఫోర్క్ తో చివర్లు సీల్ చేసుకోవాలి.
 12. ఇప్పుడు డీప్ఫ్రై కి నూనె వేడి చేసి మీడియం హీట్ లో ఫ్రై చేసుకోవాలి.
 13. రెండువైపులా దోరగా కాలనిచ్చి సెర్వింగ్ ప్లేట్లో తీసుకుని టమాటో పచ్చడితో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర