హోమ్ / వంటకాలు / కప్ కేక్

Photo of Cup cakes by Rashmi SudhiMurthy at BetterButter
381
2
0.0(0)
1

కప్ కేక్

Jan-26-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కప్ కేక్ రెసిపీ గురించి

ఎప్పుడు క్రీమ్ వేసి చేసే కేక్ కన్నా కొంచెం వెరైటీ గా బాగుంటుంది. ఇందులో మిల్క్ మెయిడ్, క్రీమ్ ఏమి లేకుండా ఈసీ గా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే సులువుగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • బేకింగ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 & 1/2 కప్పులు
  2. పంచదార పొడి 1 కప్
  3. పెరుగు 1 కప్
  4. వంట సోడా 1/2 టీ స్పూన్
  5. బేకింగ్ పౌడర్ 1 & 1/4 టీ స్పూన్
  6. వెనిల ఎసెన్స్ 1 & 1/2 టీ స్పూన్
  7. నూనె 1/2 కప్
  8. పాలు 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా మైదా జల్లడి పెట్టి ఉంచాలి
  2. ఒక బౌల్లో పెరుగు వేసి అందులో పంచదార పౌడర్ వేసి బాగా కలపాలి
  3. ఇందులో సోడా పుడి, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. కొంచెం సేపు కలిపిన తర్వాత ఈ పెరుగు మిశ్రమం లో నురుగు వస్తుంది
  4. ఇందులో వెనిల ఎసెన్స్ మరియు నూనె వేసి కలపాలి
  5. ఇప్పుడు ఇందులో మైదా వేసి ఉంటలు లేకుండా కలపి చిన్న చిన్న కేక్ కప్పులు తీసుకొని అందులో సగం వరకు నింపాలి
  6. మైక్రోవేవ్ 200 డిగ్రీ ప్రి హీట్ చేసి పెట్టుకొని ఇందులో కి నింపిన కప్పులు పెట్టి 20 నిమిషాలు బాకె చేయాలి
  7. 15 నిమిషాల తరువాత పాలతో ఒకసారి కేక్స్ ను బ్రష్ చేయాలి
  8. 20 నిమిషాల తరువాత ఒక టూత్ పిక్ తో గుచ్చి చూసి ఇంకా పచ్చిగా ఉంటే ఇంకొంచెం సేపు బేక్ చేయాలి
  9. ఒకొక్క మైక్రోవేవ్ ఒక పవర్ ఉంటుంది కాబట్టి బేకింగ్ టైం వేరుగా ఉంటుంది.
  10. కప్ కేక్ మంచి కలర్ రాగానే చల్లారిన తర్వాత పేపర్ తీసి సర్వ్ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర