హోమ్ / వంటకాలు / ఆకుకూర కందిపప్పు కొర్ర అన్నంతో

Photo of Greenleaves toordal with foxtailmillet rice by Chandrika Marripudi at BetterButter
414
4
0.0(0)
0

ఆకుకూర కందిపప్పు కొర్ర అన్నంతో

Jan-30-2019
Chandrika Marripudi
240 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకుకూర కందిపప్పు కొర్ర అన్నంతో రెసిపీ గురించి

ఆకుకూర పప్పు కందిపప్పు తో,కొర్ర అన్నంలోకి. చాలా సులభంగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనంలోకి చాలా చాలా ఆరోగ్యకరమైన భోజనం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కందిపప్పు : 2 కప్పులు
  2. తోటకూర : 1 కట్ట
  3. పాలకూర : 2 కట్టలు
  4. ఉల్లిపాయలు : 2
  5. పచ్చిమిర్చి : 6
  6. ఉప్పు : తగినంత
  7. కారం : 2 స్పూన్లు
  8. పసుపు : 1/4 స్పూన్
  9. చింతపండు : ఉసిరికాయంత
  10. నూనె : 4 స్పూన్లు
  11. ఆవాలు : 2 స్పూన్లు
  12. జీలకర్ర : 2 స్పూన్లు
  13. ధనియాలు : 2 స్పూన్లు
  14. ఇంగువ : చిటికెడు

సూచనలు

  1. కందిపప్పు కడిగి కుక్కర్ లో వేసుకుని 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి
  2. పాలకూర,తోటకూర లను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి
  3. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా తరిగి అన్ని కుక్కర్ లో వేయాలి కందిపప్పు తోపాటు.
  4. కొద్దిగా చింతపండు, పసుపు, కారం వేసి మూత పెట్టి 4,5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  5. స్టవ్ ఆపేసి ఆవిరి పోయాక మూత తీసి తగినంత ఉప్పు వేసి పప్పుని ఎనపాలి గరిటతో.
  6. పోపు పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేగాక ఇంగువ వేసి కలిపి ఈ తాలింపుని పప్పులో వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.
  7. కొర్రలు 4,5 గంటలు నానపెట్టి అన్నంలా వండుకోవాలి.
  8. కొర్ర అన్నంలో పప్పు వేసుకుని తింటే కమ్మగా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర