హోమ్ / వంటకాలు / బార్లీ ఉప్మా

Photo of Barley khichdi  by kalyani shastrula at BetterButter
1139
6
0.0(0)
0

బార్లీ ఉప్మా

Jan-30-2019
kalyani shastrula
480 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బార్లీ ఉప్మా రెసిపీ గురించి

బార్లీతో చేసే ఉప్మా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్ బార్లీ
  2. 1కప్ పచ్చి బఠాణి
  3. 2క్యారెట్ లు
  4. 2టమాటా లు
  5. చిన్న అల్లం ముక్క
  6. చిన్న నిమ్మకాయ ముక్క
  7. అర కప్పు క్యాలీఫ్లవర్ తురుము
  8. నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి
  9. చిన్న కప్ ఉడికించి ముక్కలు చేసుకున్న రాజ్మా
  10. కొత్తిమీర ఒక కట్ట
  11. కరివేపాకు ఒక రెమ్మ
  12. ఒక రెమ్మ పూదిన ఆకులు
  13. పసుపు చిటికెడు
  14. రెండు స్పూన్ ల వేయించి పొడి కొట్టుకున్న పల్లి పొడి /పల్లీలు
  15. రసం పొడి ఒక స్పూన్
  16. తగినంత ఉప్పు
  17. పోపుకు సరిపడా నూనె /నెయ్యి

సూచనలు

  1. ముందుగాకప్ బార్లీ ,కొన్ని రాజ్మా గింజలు సెపరేట్ గ కనీసం 8గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి .వీటిని విడివిడిగా ఉడకబెట్టుకోవాలి .రాజ్మా కు అయిదు విసిల్స్ వచ్చేవరకు ఉంచాలి .
  2. ఉడికించిన బార్లీ
  3. కారట్ ,అల్లం ,పచ్చి మిర్చి ,టమాటా ,రాజ్మా , కాలి ఫ్లవర్ ,కరివేపాకు ,కొత్తిమీర అన్నీ చిన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి
  4. తరిగిన రాజ్మా
  5. మూకుడులో నూనె వేసి వేడెక్కాక పోపుగింజలు పసుపు ,ఇంగువ వేసి వేగనివ్వాలి
  6. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి,పచ్చి బఠాణి కూడా వేసి (వేరే veg.కూడా వేసుకోవచ్చు ) వేగనివ్వాలి .ఇష్టముంటే ఉల్లి కూడా వేసుకోవచ్చు .
  7. కొద్దిగా నీరు పోసుకొని ,(ఉంటే బార్లీ ఉడికించిన నీరు పోసుకోవచ్చు )కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి
  8. ముక్కలన్నీ ఉడికాక నీరు అంత పోయి దగ్గర పడ్డాక ఉడికించి పెట్టుకున్న బార్లీ గింజలు వేసి కలపాలి
  9. కొద్దిగా ఉప్పు ,రసం పొడి ,పల్లీల పొడి కొత్తిమీర వేసి మూత పెట్టి చిన్న మంటమీద కాసేపు వేగనివ్వాలి
  10. అయిదు నిమిషాలు అలా ఉంచి నిమ్మరసం పిండి దింపాలి .
  11. ప్రోటీన్ రిచ్ మరియు ఫైబర్ ఫుడ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర