పనీర్ మొదక్ | Paneer modak Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  31st Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Paneer modak recipe in Telugu,పనీర్ మొదక్, Shobha.. Vrudhulla
పనీర్ మొదక్by Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

పనీర్ మొదక్ వంటకం

పనీర్ మొదక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer modak Recipe in Telugu )

 • పనీర్ 250 గ్రామ్స్ అంటే ఒక పావు
 • జీడిపప్పు ఒక కప్పు
 • పాలు ఒక కప్పు
 • పంచదార ఒక కప్పు
 • ఏలకలపొడి ఒక చెంచా...
 • నెయ్యి 3 చంచాలు..

పనీర్ మొదక్ | How to make Paneer modak Recipe in Telugu

 1. ముందుగా పాలల్లో జీడిపప్పు వేసి 3 గంటలు నాన పెట్టాలి
 2. నానపెట్టి, కావాల్సినవన్నీ దగ్గర ఉంచుకోవలెను
 3. రెండు గంటల తరువాత మిక్సీ లో నానపెట్టిన పాలు జీడిపప్పు రుబ్బి అందులోనే పంచదార వేసి రుబ్బి అప్పుడు మళ్ళీ పనీర్ వేసి రుబ్బాలి మెత్తగా
 4. పంచదార వేసింది
 5. యిక్కడ పనీర్ వేసి రుబ్బాను
 6. పనీర్ ని చిదుముకొని మిక్సీలో వేయాలి
 7. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 చంచాలు నెయ్య వేసుకొని వేడి చేసి ఆ తరువాత అందులో రుబ్బి ఉంచిన ఈ పనీర్ ముద్ద ని వేసి బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి
 8. బాగా దగ్గర పడ్డాక ఇక ఒక చెంచా నెయ్య మరియు యాలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి గట్టిపడే వరకు యింకా నెయ్య వదుల్తుంది.అప్పుడు దించేయ వలెను.
 9. ఇప్పుడు ఒక ప్లేట్ లో నెయ్యి రాసి దాంట్లో ఈ ముద్ద వేసి చల్లారాక బాగా కింద మీద కలపాలి స్మూత్ గా వస్తుంది
 10. ఇలా ఉండాలా చేసి కొంత సేపు ఉంచాలి కాస్ట్ చల్లారి గట్టిపడుతుంది
 11. ఇప్పుడు దాన్ని మొదక్ ల ఆకారం లో చేయటమే. అంతే పనీర్ మొదక్ తయారు.

నా చిట్కా:

కావాలంటే వీటిని వేయించిన జీడిపప్పు మరియు పిస్తా తో కూడా అదనంగా ఉండేలా అమార్చ వచ్చును.

Reviews for Paneer modak Recipe in Telugu (0)