ఉలవల చారు | Horsegram Rasam Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  2nd Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Horsegram Rasam  by kalyani shastrula at BetterButter
ఉలవల చారుby kalyani shastrula
  • తయారీకి సమయం

    8

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

12

0

ఉలవల చారు వంటకం

ఉలవల చారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Horsegram Rasam Recipe in Telugu )

  • కప్పు ఉలవలు
  • నాలుగు పచ్చిమిర్చి
  • జిలకర స్పూన్
  • గోళి సైజు చింతపండు
  • చిన్న అల్లం ముక్క
  • స్పూన్ మిరియాలు
  • కరివేపాకు రెమ్మ
  • కొత్తిమీర కట్ట
  • పోపుగింజలు
  • పసుపు చిటికెడు
  • ఇంగువ చిటికెడు
  • ఉప్పు సరిపడా
  • నూనె పోపుకు

ఉలవల చారు | How to make Horsegram Rasam Recipe in Telugu

  1. ముందుగా ఉలవలు 8గంటలు నానబెట్టి ఆరు విసిల్స్ వచ్చేవరకు ఉడికించి పెట్టుకోవాలి
  2. ఉడికించిన ఉలవలు వడకట్టుకోవాలి
  3. వడపోయగా వచ్చిన ఉలవలు ఉడికించిన నీరు
  4. చింతపండు నానబెట్టుకోవాలి
  5. పచ్చిమిర్చి ,జిలకర ,మిరియాలు ,అల్లం చింతపండు అన్నీ కూడా మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి
  6. తయారయిన పేస్ట్
  7. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి పప్పులు,ఆవాలు ,జిలకర ఇంగువ ,పసుపు వేసి పోపు చేసుకోవాలి
  8. పోపు అయ్యాక అందులో తయారు చేసుకున్న పేస్ట్ వేసి ఒకసారి కలిపి ఉలవలు వడపోసుకున్న నీళ్లు పోసి ,అవసరమైతే వేరే నీళ్లు కూడా కొన్ని పోసి తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి .
  9. మరుగుతున్న ఉలవల నీళ్లు
  10. ఇప్పుడు కొన్ని ఉలవలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  11. ఈ ఉలవల ముద్దను మరుగుతున్న చారులో వేసి కలపాలి
  12. బాగా మరిగి కొద్దిగా చిక్కగా అయ్యాక కొత్తిమీర వేసి గిన్నెలోకి తీసుకోవాలి . తినేవాళ్లు ఉల్లి వెల్లిపాయ వేసుకుంటారు .

Reviews for Horsegram Rasam Recipe in Telugu (0)