హోమ్ / వంటకాలు / అలసందల వడలు

Photo of Black eyed peas patties by Pasumarthi Poojitha at BetterButter
569
7
0.0(0)
0

అలసందల వడలు

Feb-04-2019
Pasumarthi Poojitha
240 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసందల వడలు రెసిపీ గురించి

రిచ్ ప్రోటీన్ రెసిపీ పిల్లలకి కూడా చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అలసందలు 1 కప్పు
  2. బంగాళదుంప 1
  3. ఉల్లిపాయ 1
  4. కొత్తిమీర కొద్దిగా
  5. ఉప్పు సరిపడా
  6. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  7. ధనియాల పొడి 1 కప్పు
  8. పసుపు చిటికెడు
  9. గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్
  10. నూనె ఫ్రై కి సరిపడా
  11. నీళ్లు 1 గ్లాస్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో అలసందలు వేసుకొని నీళ్లు పోసి 4 గంటలు నానపెట్టాలి.
  2. ఇప్పుడు వాటిని కడిగి శుభ్రంగా మంచి నీళ్ళు కొన్ని పోసి ఉప్పు కొద్దిగా వేసి మెత్తగా అయ్యే అంత వరకు ఉడికించుకోవాలి.
  3. నీళ్లు వార్చుకొని ఒక గిన్నె లో కి తీసుకోవాలి .
  4. బంగాళదుంప ను శుభ్రంగా కడిగి పై పొట్టు తీసి తురుముకోవాలి, అలాగే ఉల్లిపాయ కూడా శుభ్రంగా కడిగి తురిమి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి.
  5. అలసందలు మెత్తగా మేదుపుకొని అందులో,తురిమిన బంగాళదుంప ,ఉల్లిపాయ తురుము,మిరియాల పొడి,కొద్దిగా ఉప్పు,ధనియాల పొడి,పసుపు,గరం మసాలా పొడి ,కొత్తిమీర కొద్దిగా,వేసుకొని మెత్తటి ముద్దను కలుపుకోవాలి .
  6. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టుకొని నూనె పోసుకోవాలి.
  7. వేడి అయిన తర్వాత పిండి ముద్ద ను చిన్న ఉండలుగా తీసుకొని వడ ఆకారం లో చేసుకొని మధ్యలో చిన్న బెజ్జం పెట్టుకోవాలి.
  8. నూనె లో వేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి
  9. ఇప్పుడు వేగిన తర్వాత ఒక ప్లేట్ లో కి తీసుకోవాలి.
  10. వేడి వేడి గా టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర