మీల్ మేకర్ మసాలా | Meal maker masala Recipe in Telugu

ద్వారా sravanthi komaravelli  |  4th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Meal maker masala by sravanthi komaravelli at BetterButter
మీల్ మేకర్ మసాలాby sravanthi komaravelli
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

14

0

మీల్ మేకర్ మసాలా వంటకం

మీల్ మేకర్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Meal maker masala Recipe in Telugu )

  • మీల్ మేకర్ 100 గ్రాములు
  • ఉల్లిపాయలు 3
  • టొమాటోలు 4
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూను
  • లవంగాలు 4
  • దాల్చిన చెక్క చిన్న ముక్క
  • యాలకులు 3
  • జీడిపప్పు 10
  • ఉప్పు తగినంత
  • పచ్చిమిర్చి 2
  • గరం మసాలా 1/2 టీ స్పూన్
  • జీరా పొడి 1/2 టీ స్పూన్
  • కొత్తిమీర
  • నూనె 4 స్పూన్లు
  • పసుపు 1/4 టీ స్పూన్
  • కసూరి మేథీ 1/2 టీ స్పూన్

మీల్ మేకర్ మసాలా | How to make Meal maker masala Recipe in Telugu

  1. పాన్ వేడి ఎక్కాక నూనె వేసుకోవాలి. వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరువాత ఒకటి వేసుకోవాలి. ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి.
  2. మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఇంకో పాన్లో నూనె వేసి వేడెక్కాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాట మసాలా వేసుకోవాలి.
  4. వేరె పాన్ లో నీళ్ళు వేడి చేసి ఐదు నిమిషాలు మీల్ మేకర్ వేసి ఉంచుకోవాలి. తరువాత నీళ్ళు పిండేసి పక్కన పెట్టుకోండి.
  5. ఇప్పుడు గ్రేవీ లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టండి.
  6. తరువాత మీల్ మేకర్ వేయాలి, కసూరి మేథీ, కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి.

Reviews for Meal maker masala Recipe in Telugu (0)