హోమ్ / వంటకాలు / సోయాబీన్స్ ,పొన్నగంటికూర పులిహోర

Photo of Soyabeans ,dwarf leaf rice by kalyani shastrula at BetterButter
668
2
0.0(0)
0

సోయాబీన్స్ ,పొన్నగంటికూర పులిహోర

Feb-09-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయాబీన్స్ ,పొన్నగంటికూర పులిహోర రెసిపీ గురించి

Rice item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2కప్స్ పొడిగా వండుకున్న అన్నము
  2. Cup చిన్నగా తరిగిన పొన్నగంటి కూర
  3. సగం కప్ నానబెట్టి పొట్టుతీసి ఉడకబెట్టుకున్న సొయా బీన్స్
  4. నాలుగు పచ్చిమిర్చి
  5. రెండు ఎండుమిర్చి
  6. చింతపండు రసం పావు కప్పు లేదా చిక్కటి గుజ్జు రెండు స్పూన్స్
  7. ఒకటి లేదా రెండు స్పూన్స్ నువ్వుల పొడి
  8. ఉప్పు
  9. పోపుగింజలు
  10. పసుపు
  11. ఇంగువ
  12. పల్లీలు గుప్పెడు
  13. కరివేపాకు
  14. కొత్తిమీర

సూచనలు

  1. ముందుగా సోయాబీన్స్ ఆరుగంటలు నానబెట్టుకుని పొట్టుతీసి ఉడికించి పెట్టుకోవాలి
  2. పొన్నగంటి కూర ఆకులు రిల్లి పెట్టుకోవాలి
  3. ఆకులు చిన్నగా కట్ చేసుకోవాలి
  4. మూకుడులో నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ వేసి వేగాక కరివేపాకు,పల్లీలు ,పచ్చిమిర్చి వేసి పులిహోర పోపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు అదే మూకుడులో కొద్దిగా నూనె వేసి తరిగి పెట్టుకున్న పొన్నగంటి కూర వేసి మగ్గించు కోవాలి .
  6. కూర మగ్గాక కొంచెం చింత పండు రసం కాని లేదా చిక్కటి గుజ్జు అయితే రెండు స్పూన్స్ వేసి ఉడికించాలి .(చింతపండు వద్దనుకుంటే చివర్లో నిమ్మరసం పిండాలి ).ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ కూడా వేయాలి
  7. కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాక ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా వేసి తగినంత ఉప్పు ,ఒక స్పూన్ నువ్వులపొడి ,కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉంచాలి
  8. అయిదు నిమిషాలు అయ్యాక గిన్నెలోకి తీసుకొని పైన తయారుచేసుకున్న పులిహోర పోపు కలిపితే ఎంతో ప్రోటీన్ కలిగిన మంచి కాల్షియమ్ ఫుడ్ సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర