హోమ్ / వంటకాలు / ప్రోటీన్ లడ్డు

Photo of Protein laddu by sneha gilla at BetterButter
773
2
0.0(0)
0

ప్రోటీన్ లడ్డు

Feb-14-2019
sneha gilla
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ లడ్డు రెసిపీ గురించి

ఇందులో నువ్వులు,బెల్లము,పల్లీలు,పుట్నాలు వేసి చేశాను.ఈ పదార్థాలన్నిటిలో కూడా ప్రోటీన్ శాతం ఎక్కువగానే ఉంటుంది.ఈ లడ్డుని పిల్లలు మరియు పెద్దలు రోజు ఒకటి చొప్పున తినటం వల్ల ప్రోటీన్స్ లభిస్తాయి.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కప్ నువ్వులు
  2. 1/2 కప్ పల్లీలు
  3. 1/2 కప్ పుట్నాలు
  4. 1 1/2 cup బెల్లము
  5. 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు

సూచనలు

  1. ముందుగా పల్లీలు,నువ్వులను విడి విడి గా వేయించి పెట్టుకోవాలి.
  2. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి బెల్లము,నీళ్లు వేసి బెల్లం కరిగాక దాన్ని వడగట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే గిన్నెలో కరిగించిన బెల్లం నీళ్లు వేసి 10 నుంచి 15 నిముషాలు ఉడికించాలి.
  4. పాకం వచ్చిందో లేదో చూసుకోడానికి ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా బెల్లం మిశ్రమాన్ని వేసి చూసుకోవాలి.అది గట్టిగ వచ్చినచో పాకం వచ్చినట్లే.
  5. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అందులో పుట్నాలు, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు,నువ్వులు వేసి చక్కగా కలిపి లడ్డుల్లా చుట్టుకుంటే ప్రోటీన్ లడ్డు సిద్దం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర