హోమ్ / వంటకాలు / బాదాం బర్ఫీ & బాదాం లడ్డు

Photo of Almond Burfi And Almond laddo  by kalyani shastrula at BetterButter
575
1
0.0(0)
0

బాదాం బర్ఫీ & బాదాం లడ్డు

Feb-18-2019
kalyani shastrula
120 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదాం బర్ఫీ & బాదాం లడ్డు రెసిపీ గురించి

బాదాం తో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ బాదాం
  2. కప్ చెక్కర పొడి
  3. స్పూన్ ఇలాయిచి పొడి
  4. చిటికెడు కుంకుమ పువ్వు
  5. సగం కప్ పాలు
  6. 4 tsbn అవు నెయ్యి

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టు వేడిచేసుకోవాలి .
  2. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాదాం ను అందులో వేసి మూత పెట్టి ఉంచాలి
  3. అరగంట పక్కన పెట్టాలి
  4. కుంకుమ పువ్వు కొన్ని పాలల్లో వేసి పెట్టుకోవాలి
  5. ఇప్పుడు బాదాం ను వేడి నీళ్లలో నుండి వీటిని చల్లటి నీళ్ళలోకి వేసుకోవాలి
  6. అయిదు ఇపుడు బాదాం ఒత్తితే పొట్టు సులభంగ వస్తుంది .ఇలా అన్నీ పొట్టు తీసి పెట్టుకోవాలి
  7. ఇప్పుడు వీటిని మళ్లీ వేడినీళ్ల లో వేసి ,మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టాలి .
  8. ఇప్పుడుదీనిలోనుండి బాదాం తీసి మిక్సీలో వేసి కుంకుమపువ్వు వేసి ఉంచిన పాలు పోసి గ్రైండ్ చేయాలి
  9. ఇంకా కొన్ని పాలు పోసి పేస్ట్ వలె చేసుకోవాలి
  10. ఇప్పుడు మూకుడులో రెండు చెంచాల నెయ్యి వేసి వేడిచేయాలి
  11. నెయ్యి కరిగాక బాదాం పేస్ట్ వేసి కలిపాలి
  12. మిక్సీ చేసి పొడి చేసిపెట్టుకున్న చెక్కరపొడి
  13. రెండు నిముషాలు వేగాక ఇలాయిచి పొడి వేసి ,చెక్కరపొడి కూడా వేయాలి
  14. చెక్కర పొడి వేసి కలపగానే పలచగా అవుతుంది .మీడియం మంటమీద కలుపుతూ ఉండాలి
  15. బాగా దగ్గరపడి మూకుడుకు అంటకుండా ఉన్నప్పుడు తీసి ఒక ప్లేట్ లో వేయాలి (.లేదా చేతితో పట్టుకుంటే మారి ఉండగకుండా చూసుకోవాలి .అప్పుడు తీయాలి )
  16. బాగా చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని బాగా కలిపి ముద్దవలె చేయాలి
  17. ఇప్పుడు ముద్దను ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసి ఒక షేప్ లోకి మలచుకోవాలి .ఇప్పుడు చెపాతి కర్రకు కూడా నెయ్యి రాసి నెమ్మదిగా అంతా ఒకే మందంలో ఉండేట్టుగా ఒత్తుకోవాలి
  18. ఇప్పుడు చాకుతో పీసెస్ గ కట్ చేయాలి
  19. నెమ్మెదిగా పీసెస్ ని తీసి వేరే ప్లేట్ లోకి సర్దుకోవాలి
  20. వాటిమీద మళ్లీ పై నుండి కుంకుమ పువ్వు వేసి ,కవర్ పై మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలను లడ్డుల వలె చేసుకోవాలి
  21. ఇప్పుడు ఎంతో రుచికరమైన బాదాం బర్ఫీ ,లడ్డు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర