హోమ్ / వంటకాలు / డ్రాగన్ చికెన్

Photo of Dragon chicken by SwathiBindhu Peeta at BetterButter
642
3
0.0(0)
0

డ్రాగన్ చికెన్

Feb-20-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రాగన్ చికెన్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న వంటకం.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • చైనీస్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ 250 గ్రాములు
  2. గుడ్డు 1
  3. ఉప్పు తగినంత
  4. పంచదార 1 టీ స్పూను
  5. సోయా సాస్ 2 టీ స్పూన్లు
  6. మిరియాల పొడి 2 టీ స్పూన్లు
  7. టమాటో కెచప్ 2 టీ స్పూన్లు
  8. పండు మిర్చి గుజ్జు 2 టీ స్పూన్లు
  9. తరిగిన ఉల్లికాడలు 1 టీ స్పూను
  10. నూనె తగినంత
  11. తరిగిన ఉల్లిపాయలు 1
  12. తరిగిన బెంగుళూరు మిర్చి 1/4 కప్పు
  13. జీడిపప్పు 25 గ్రాములు
  14. మొక్కజొన్న పిండి 2 టీ స్పూన్లు
  15. తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా చికెన్ నీ శుభ్రం చేసుకుని సన్నగా పొడుగు ముక్కలుగా చేసుకుని అందులో కొంచం ఉప్పు, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూను మొక్కజొన్న పిండి ఒక గుడ్డు పగల కొట్టి అందులో వేసుకుని.బాగా కలపాలి.
  2. ఇప్పుడు బాణీ పెటు కుని అందులో నూనె పోసి అది వేడి అయ్యాక అందులో చికెన్ వేసి బంగారు రంగు వచ్చేవరకు. వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు వేరే బాణీ లో నూనె పోసి, అది.వేడి అయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి అది వేగాక అందులో జీడిపప్పు వేసుకుని వేయించాలి.
  4. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్ 3 రంగులు వేసుకుని వేయించాలి.
  5. ఇప్పుడు 2 ఎండు మిర్చి, కొంచం ఉప్పు,.1/2 టీ స్పూన్ పంచదార వేసుకుని. వేయించాలి.
  6. 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని కలపాలి.
  7. ఇప్పుడు అందులో పండు మిర్చి గుజ్జు వేసుకుని బాగా కలపాలి.
  8. ఇప్పుడు అందులో టమాటో కెచప్ వేసుకుని బాగా కలపాలి.
  9. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  10. చివరిగా అందులో తరిగిన ఉల్లి పరకలు వేసుకుని కలపాలి.
  11. వంటకం సిద్ధం. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర