హోమ్ / వంటకాలు / నవరతన్ చింతకాయ పులిహోర

Photo of navaratan raw tamarind rice by Annapurna jinkala at BetterButter
588
1
0.0(0)
1

నవరతన్ చింతకాయ పులిహోర

Feb-20-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నవరతన్ చింతకాయ పులిహోర రెసిపీ గురించి

చింతకాయ పులుపు బాగా తెలుస్తూ గింజలు అన్ని పంటికింద పడుతూ యుమ్మ్య్ గా ఉంటుంది పులిహోర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బాస్మతి రైస్ కప్
  2. చింతకాయలు 4
  3. నువ్వులనూనె 3 స్పూన్లు
  4. ఆవాలు స్పూన్
  5. జీలకర్ర స్పూన్
  6. పల్లీలు 2 స్పూన్లు
  7. శనగపప్పు ఒక స్పూన్
  8. మినపప్పు ఒక స్పూన్
  9. ధనియాలు 2 స్పూన్లు
  10. మెంతులు హాఫ్ స్పూన్
  11. ఎండుమిర్చి 10
  12. కందిపప్పు 2 స్పూన్లు
  13. అలసంద పప్పు 2 స్పూన్లు
  14. నువ్వులు 2 స్పూన్లు
  15. ఇంగువ ఒక స్పూన్
  16. కరివేపాకు 2 రెమ్మలు
  17. పసుపు హాఫ్ స్పూన్
  18. ఉప్పు తగినంత

సూచనలు

  1. బాస్మతి రైస్ కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి
  2. చింతకాయలు నీరు పోసి ఉడికించి
  3. చల్లారాక మెదిపి రసం తీసి పెట్టుకోవాలి
  4. ఇవి అన్ని కలిపి
  5. పెనం పైన వేయించి పొడి కొట్టాలి
  6. అన్నం పొడిపొడిగా ఉడికించి పెట్టుకోవాలి
  7. పోపు కి అన్ని రెడి చేసి పెట్టుకోవాలి
  8. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్లు నువ్వులనూనె వేసి
  9. ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు కందిపప్పు అలసందపప్పు మినపప్పు వేసి వెయ్యిస్తూ
  10. పచ్చిమిర్చి ఎండుమిర్చి కాజు బాదాం కరివేపాకు వేసి కలిపి వెయ్యిస్తూ
  11. నువ్వులు కూడా వేసి కలిపి
  12. అన్ని వేగాక పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  13. ప్లేట్ లోకి అన్నం తీసి చింతకాయ రసం వేసి కలిపి
  14. తగినంత ఉప్పు వేసి కలిపి
  15. ముందుగా తయారు చేసుకున్న ధనియాల పొడి వేసి కలిపి
  16. అన్నం లో పోపు వేసి కలపాలి
  17. ప్లేట్ లో అంతా కలిపి
  18. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేస్తే యుమ్య్ పులిహోర రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర