హోమ్ / వంటకాలు / మిక్స్డ్ వెజిటేబుల్ కూర

Photo of Mix veg curry by Rashmi SudhiMurthy at BetterButter
670
3
0.0(0)
0

మిక్స్డ్ వెజిటేబుల్ కూర

Feb-22-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ వెజిటేబుల్ కూర రెసిపీ గురించి

ఈ గ్రేవీ బాదంపప్పు తో చేయడం వలన ఆరోగ్యానికి మంచిది. రోటీ మరియు ఏదైనా రైస్ ఐటమ్ లోకి మంచి కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంప ముక్కలు 1/4 కప్
  2. క్యారెట్ ముక్కలు 1/4 కప్
  3. బీన్స్ ముక్కలు 1/4 కప్
  4. పచ్చి బఠానీ 2 టేబుల్ స్పూన్లు
  5. ఉల్లిపాయలు తరిగినవి 2 టేబుల్ స్పూన్లు
  6. పచ్చిమిర్చి 2
  7. టొమాటో పెద్దది 1
  8. పచ్చికొబ్బరి తురుము 1/4 కప్
  9. బాదంపప్పు 2 టేబుల్ స్పూన్లు
  10. వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు
  11. అల్లం 1 చిన్న ముక్క
  12. వెల్లుల్లి రెబ్బలు 6
  13. పసుపు 1/2 టీ స్పూన్
  14. ఉప్పు రుచికి సరిపడా
  15. కారం పుడి 2 టీ స్పూన్లు
  16. కిచెన్ కింగ్ మసాలా 2 టీ స్పూన్లు
  17. ధనియాల పుడి 1 టీ స్పూన్
  18. కసూరి మేథీ 1 టీ స్పూన్
  19. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  20. కరివేపాకు
  21. నీళ్ళు తగినంత
  22. నూనె 2 టేబుల్ స్పూన్లు
  23. షాహీ జీరా 1 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా టొమాటో ముక్కలు, పచ్చికొబ్బరి తురుము, బాదంపప్పు, అల్లం,వెల్లుల్లి, నువ్వులు,తగినంత నీళ్ళు వేసి మిక్సీలో పేస్ట్ చెయ్యాలి
  2. ఒక కుక్కర్ లో నూనె వేడి చేసి అందులో షాహీ జీరా , ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేపాలి
  3. అందులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై చెయ్యాలి
  4. ఇప్పుడు తరిగిన కూరగాయల ముక్కలు,ఉప్పు,కారం,కిచెన్ కింగ్ మసాలా, తగినంత నీళ్ళు వేయాలి
  5. అందులో కొత్తిమీర, కసూరి మేథి వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  6. రుచికరమైన మిక్స్డ్ వెజ్ కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర