హోమ్ / వంటకాలు / బీట్రూటు ఆకు పెసరపప్పు.

Photo of Yellow split gram with beetroot greens. by Swapna Tirumamidi at BetterButter
447
4
0.0(0)
0

బీట్రూటు ఆకు పెసరపప్పు.

Feb-23-2019
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూటు ఆకు పెసరపప్పు. రెసిపీ గురించి

బీట్రూటు లొనే కాకుండా బీట్రూటు ఆకుల్లో కూడా చాలా పోషకాలున్నాయి..ఈ ఆకు అధికంగా మాంసకృతులు కలిగి ఉంది..ఇంకా ఫాస్ఫరస్,.జింక్ అధికంగా పీచు పదార్థాలు ఉన్నాయి.విటమిన్ బి6,మెగ్నీషియం,పొటాషియం మొదలైన ఖనిజాలు కూడవున్నాయి.కొవ్వుపదార్ధం తక్కువ శాతం ఉంటుంది ఇందులో, కాబట్టి ఈ ఆకుకూరని అల్రౌండర్ అని పిలుచుకోవచ్చు.పప్పులో వేసి వండుకోవచ్చు.కూరలా కూడా వండుకోవచ్చు.అన్నం లోకి చపాతిలలోకి కూడా బావుంటుంది.చాలా సులువుగా తక్కువ సమయం లో తయారు చేసుకోవచ్చు.ఇది తోటకూర దొరికినట్టుగా బజారులో ఎక్కువగా దొరకదు కాబట్టి, అవకాశం ఉన్న వారు విత్తనాలు వేసుకుంటే ఎప్పుడుకావాలంటే అప్పుడు వండుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఛాయ పెసరపప్పు 100 గ్రాములు
  2. బీట్రూటు ఆకులు ఒక కట్ట(25 ఆకులు)
  3. ఆవాలు అర చెంచా
  4. జీలకర్ర పావు చెంచా
  5. ఇంగువ 2 చిటికెలు(ఇష్టం ఉంటే)
  6. పచ్చిమిర్చి 2
  7. ఎండు మిర్చి2
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. వెల్లుల్లి రెబ్బలు 6
  10. అల్లం తరుగు ఒక చెంచా..
  11. నిమ్మరసం 2 చెంచాలు.. ఇష్టముంటే
  12. పసుపు 2 చిటికెళ్లు
  13. నూని పోపుకి 3 చెంచాలు
  14. ఉప్పు తగినంత.

సూచనలు

  1. ముందు పెసరపప్పు బాగాకడిగి తగినన్ని నీళ్లు పోసి ,చిటికెడు పసుపు ,కొన్ని కరివేపాకు ఆకులు తుంచి వేసి,కొద్దిగా జీలకర్ర వేసి ఉడికించుకోవాలి.బాగా మెత్తగా కాకుండా.
  2. ఈ లోగా బీట్రూటు ఆకులను శుభ్రంచేసి బాగా కడిగి నీరు ఓడ్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఆకుకూరలు ఎప్పుడూ తరిగిన తరువాత కడగకూడద ముందే కడిగాలి.
  3. ఇవి మా పెరటిలో పెంచిన బీట్రూటు ఆకులు.
  4. ఇప్పుడు మూకుడు పెట్టి నూని వేసి వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడాక ,జీలకర్ర,ఇంగువ,పసుపు,పచ్చి మిర్చి, అల్లం ముక్కలు ,ఎండు మిర్చి,,వెల్లుల్లి రెబ్బలు 2 దంచి మిగిలినవి అలాగే వేసి ,కరివేపాకు కూడా వేసి మూత పెట్టి మగ్గించాలి.
  5. ఇప్పుడు ఈ పోపులో తరిగిన బీట్రూటు ఆకులు,కొద్దిగా ఉప్పు వేసి పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
  6. ఇప్పుడు ఉడికిన పెసరపప్పుని ఈ మగ్గిన ఆకులో వేసి ఆకుకూర పప్పు రెండు బాగాకలిసేలా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు..(నేను పప్పు లొనే ఎక్కువ నీరు పోసి ఉడికిస్తాను ఎప్పుడూ.
  7. 2 నిమిషాలు ఇలా ఉడకనిచ్చి దించుకుని వేరే గిన్నీలోకి తీసుకుని...మళ్ళీ కావాలంటే కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు,ఆవాలు,ఎండు మిర్చిలతో పోపు పెట్టుకోవచ్చు.అంతే కమ్మటి ఘుమఘుమలాడే బీట్రూటు ఆకుకూరపప్పు వడ్డనకు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర