పనీర్ పాయసము డ్రై ఫ్రూయిట్స్ తో | Paneer kheer with dry fruits Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  24th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Paneer kheer with dry fruits by Vasuki Pasupuleti at BetterButter
పనీర్ పాయసము డ్రై ఫ్రూయిట్స్ తోby Vasuki Pasupuleti
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

8

0

పనీర్ పాయసము డ్రై ఫ్రూయిట్స్ తో వంటకం

పనీర్ పాయసము డ్రై ఫ్రూయిట్స్ తో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer kheer with dry fruits Recipe in Telugu )

 • సేమ్యా 200 గ్రాములు
 • పాలు ఒక లీటర్
 • అర కెజి పంచదార లో కొంచెము తగ్గించి
 • జీడిపప్పు 100 గ్రాములు
 • బాదం పప్పులు 10
 • ద్రాక్ష 25 గ్రాములు
 • సారా పప్పు 3 చెంచాలు
 • యాలకులు 6
 • నెయ్యి 5 చెంచాలు
 • ఒక కప్ మిగడి

పనీర్ పాయసము డ్రై ఫ్రూయిట్స్ తో | How to make Paneer kheer with dry fruits Recipe in Telugu

 1. ముందుగా 1 లీటర్ పాలు 200 గ్రాముల పన్నీర్ 200 గ్రాముల సేమ్యా తీసుకొని జీడిపప్పు, ద్రాక్ష, సారా పప్పు బాదం పప్పు అన్ని కోసుకుని ఉంచాలి తరువాత సేమ్యా నెయ్యి లో వేపాలి
 2. స్టవ్ మీద గిన్నెలో పాలు పోసి మరగనివ్వాలి
 3. పన్నీర్ ని తురుముకోవాలి ఇలాగ
 4. అన్ని డ్రై ఫ్రూయిట్స్ ని వేపుకోవాలి
 5. కొంచెము పంచదార లో యాలకులు వేసి మిక్సక్సీకి వెయ్యాలి
 6. బాండీలో నెయ్యి వేసి సేమ్యా వేపాలి దోరగా
 7. బాగా మరిగే పాలల్లో సేమ్యా వేసి బాగా ఉడికించాలి
 8. సేమ్యా కొంచెము సేపు ఉడికించిన తరువాత పంచదార వేసి బాగా కలపాలి
 9. తరువాత పన్నీర్ వేసి బాగా కలపాలి
 10. కొన్ని డ్రై ఫ్రూయిట్స్ వేసి బాగా కలపాలి
 11. పాల మీద వున్న మిగడి వేసి బాగా కలపాలి
 12. మిగిలిన డ్రై ఫ్రూయిట్స్ ని వేసి బాగా కలపాలి
 13. రుచికరమైన పన్నీర్ పాయసము సిద్దము

నా చిట్కా:

మిగడి వేస్తే రుచిగా ఉంటుంది .

Reviews for Paneer kheer with dry fruits Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo