హోమ్ / వంటకాలు / సోయా కాజు గ్రీన్ పీస్ క్యాప్సికమ్ పులావ్

Photo of Soya cashew green peas Capsicum pulav by SwathiBindhu Peeta at BetterButter
433
5
0.0(0)
0

సోయా కాజు గ్రీన్ పీస్ క్యాప్సికమ్ పులావ్

Feb-24-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా కాజు గ్రీన్ పీస్ క్యాప్సికమ్ పులావ్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బాస్మతి బియ్యం 1 1/2 కప్పులు
  2. తరిగిన ఉల్లిపాయలు 1
  3. తరిగిన పచ్చిమిర్చి 2
  4. తరిగిన క్యాప్సికమ్ 3 రంగులు 1 కప్పు
  5. అల్లం వెల్లుల్లి ముద్ద 1 1/2 టీ స్పూన్లు
  6. సుగంధద్రవ్యాలు 1 ప్యాకెట్
  7. పచ్చి బఠానీ 1/2 కప్పు
  8. సోయా చుంక్స్ 1/2 కప్పు
  9. నీళ్ళు తగినంత
  10. ఉప్పు 1 టీ స్పూను
  11. తరిగిన కొత్తిమీర 2 టీ స్పూన్లు
  12. నెయ్యి 3 టీ స్పూన్లు
  13. నిమ్మకాయ 1/2
  14. తరిగిన ఉల్లి పరకలు 2 టీ స్పూన్లు
  15. తరిగిన టమాటో 2
  16. జీడిపప్పు 50 గ్రాములు

సూచనలు

  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని 30 నిముషాల పాటు నాన పెట్టుకోవాలి. అలాగే సోయా నీ కూడా 10 నిముషాల పాటు నాన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అది వేడి అయ్యాక నెయ్యి వేసుకుని అందులో సుగం ద వేసుకుని వేయించాలి.
  2. ఇప్పుడు అందులో జీడపప్పు కూడా.వేసుకుని వేయించాలి.
  3. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి ముద్ద నీ వేసుకుని బాగా వేయించాలి.
  4. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, తరిగిన క్యాప్సికమ్ వేసుకుని బాగా వేయించాలి.
  5. ఇప్పుడు అందులో పచ్చి బఠాణీ వేసుకుని బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు అందులో.తరిగిన టమాటో కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్.
  7. ఎప్పుడు అందులో నాన్న పెట్టుకుని వుంచుకున్న సోయా నీ వేసి బాగా కలుపుకోవాలి.
  8. ఇప్పుడు అందులో ఉప్పు వేసి తగినంత నీళ్ళు పోసి , కొంచం.నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి.
  9. నీళ్ళు కొంచం మరిగాక అందులో నాన్న పెట్టుకుని వుంచుకున్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  10. మొత్తం మిశ్రమం వుడి కాక అందులో తరిగిన ఉల్లి పరకలు వేసుకోవాలి.
  11. అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని దించేయడమే.
  12. ఇప్పుడు ఒక సర్వింగ్ గిన్నె లో.తీసుకుని వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర