హోమ్ / వంటకాలు / పన్నీర్ కోవా గులాబ్ జామూన్

Photo of Paneer kova gulabjamun by kalyani shastrula at BetterButter
1005
5
0.0(0)
0

పన్నీర్ కోవా గులాబ్ జామూన్

Feb-25-2019
kalyani shastrula
50 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ కోవా గులాబ్ జామూన్ రెసిపీ గురించి

కోవా పన్నీరు తో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 3 కప్స్ చెక్కర
  2. 2కప్స్ నీళ్లు
  3. కాజు 8
  4. బాదాం 8
  5. ఇలాయిచి పొడి స్పూన్
  6. కోవా పావుకిలో
  7. పనీర్ 100gr.
  8. మైదా అర కప్ లేదా కొంచెం ఎక్కువ
  9. ఆవు నెయ్యి

సూచనలు

  1. ముందుగా బాదాం కాజు చిన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. చెక్కర మునిగే అంతవరకు నీళ్లు పోసి చిన్న మంటమీద పాకం కొరకు పెట్టుకోవాలి
  3. ఇలాయిచి పొడి చేసుకోవాలి
  4. కోవా
  5. పన్నీర్
  6. మైదా
  7. ఇప్పుడుకోవాను ఒక కంచం లో తీసుకుని బాగా చేతితో ఉండలు లేకుండా చూసి పిసకాలి
  8. పన్నీర్ కూడా బాగా మెదిపి కోవాతో పాటు అరచేతితో రుద్దుతూ మెత్తగా చేసుకోవాలి
  9. ఇప్పుడు మైదా కూడా వేసి బాగా అరచేతితో గట్టిగా అదుముతూ మెదపాలి .ఉండ కట్టితే స్మూత్ గా రావాలి .ఈలోపు పాకం తీగపాకం కంటే తక్కువ గా ఉన్నప్పుడు తీసి పక్కనపెట్టి మూత పెట్టి ఉంచాలి
  10. డ్రై ఫ్రూప్ట్స్ లో ఇలాయిచి వేసి అందులో కొంచెం కలిపిపెట్టుకున్న కోవా మిశ్రమం వేసి కలపాలి .ఇది స్టఫ్ఇంగ్ కొరకు వాడుతాము .
  11. లోపల స్టాఫ్ఇంగ్ కొరకు ఈ విధంగా తయారు చేసుకోవాలి .
  12. తయారయిన చెక్కర పాకం
  13. ఇప్పుడు కోవా మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని ,ఒక ఉండను వెడల్పుగా చేసి అందులో బాదాం ముద్దను కొద్దిగా పెట్టి క్లోజ్ చేయాలి .(పూర్ణపు బూరల వలె)
  14. మూకుడులో ఆవు నెయ్యివేసి , స్టవ్ మీద పెట్టి సిమ్ మీద ఉంచాలి.అది వేడెక్కేలోపు స్టఫ్ చేసుకున్న కోవా ముద్దలను మొత్తం ఈ విధంగా రౌండ్ గా స్మూత్ గా చేసుకొని పెట్టుకోవాలి
  15. ఈలోపు ఆవునెయ్యి వేడిగా అవుతుంది . మీడియం మంటలో ఒక్కొక్కటిగా తయారుచేసుకున్న జామూన్ లను వేసి ఎర్రగా గోలించుకోవాలి .
  16. ఏవిధంగా రెండు వైపులా గోలించాలి
  17. వీటిని చెక్కర పాకంలో వేసి మూత పెట్టుకోవాలి .పాకం గోరువెచ్చగా ఉండాలి .
  18. ఏవిధంగా కాసేపు పాకం లో ఉంచితే గులాబ్ జామూన్ లు పాకం పీల్చుకొని ఉంటాయి .
  19. తయారయిన జామూన్స్ .మధ్యలో బాదాం తగులుతూ చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర