హోమ్ / వంటకాలు / పచ్చి బఠాని మొక్కజొన్న పుణుకులు

Photo of Greenpeas sweet corn hot dumplings by Swapna Tirumamidi. at BetterButter
642
2
0.0(0)
0

పచ్చి బఠాని మొక్కజొన్న పుణుకులు

Feb-27-2019
Swapna Tirumamidi.
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి బఠాని మొక్కజొన్న పుణుకులు రెసిపీ గురించి

మరో ప్రోటీన్ పవర్ .పచ్చి బఠాని ,మొక్కజొన్న వేసి చేసిన ఈ పుణుకులు పెసర పుణుకుల్లా చాలా బావుంటాయి.చిరుతిండిలా తినడానికి,పిల్లల డబ్బాల్లో పట్టడానికి కూడా చాలా అనువుగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి బఠానిలు /ఫ్రోజెన్ బఠానిలు 1 కప్పు
  2. స్వీట్ కార్న్ 1 కప్పు
  3. అల్లం అంగుళం ముక్క
  4. జీలకర్ర 1 చెంచా
  5. కొత్తిమీర తరుగు గుప్పెడు
  6. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  7. నాన పెట్టిన పెసరపప్పు 1 కప్పు
  8. మొక్కజొన్నల పిండి 5 చెంచాలు
  9. ఉప్పు సరిపడా
  10. వంటసోడా అర చెంచా
  11. నూని వేయించడానికి చాలినంత
  12. పచ్చిమిర్చి.4..

సూచనలు

  1. మిక్సిజారులో నానపెట్టిన పెసరపప్పు,ఫ్రోజెన్ బఠాని, స్వీట్ కార్న్,అల్లం,పచ్చిమిర్చి,జీలకర్ర వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి.
  2. వేరే గిన్నీలో ఉల్లి ముక్కలు,మొక్కజొన్న పిండి,ఉప్పు,కొత్తిమీర,వేసికలిపి అందులో రుబ్బిన ముద్దని వేసి బాగా కలిపి ఉంచాలి.ముద్ద పలుచగా ఉండకూడదు.బాగా గట్టిగా ఉండకూడదు.మధ్య స్థాయి లో ఉండాలి.
  3. ఇప్పుడు మూకుడు పెట్టి నూని వేసి కాచాలి.నూని బాగా వేడెక్కాక పిండిలో వంట సోడా కలిపి పుణుకుల్లా నూనిలో వేసుకోవాలి. మీడియం మంట పై బంగారు రంగు వచ్చేదాకా వేయించి,టిష్యూ పేపర్స్ మీదకి తీసుకోవాలి.
  4. అంతే చక్కగా పైన కరకరలాడుతూ కమ్మని ఘుమ ఘుమ లాడే పచ్చి బఠాని మొక్కజొన్నల పుణుకులు సిద్ధం. ఇవి ఉట్టిగానే తినవచ్చు.తప్పకుండా చేసుకుని చెప్పండి మీ అనుభూతులు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర