హోమ్ / వంటకాలు / ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ సలాడ్

Photo of Protein rich Sprouts salad by Deepika K at BetterButter
900
4
0.0(0)
0

ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ సలాడ్

Feb-28-2019
Deepika K
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ సలాడ్ రెసిపీ గురించి

మొలకలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ చాలా మంది ఇలా తినడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ సలాడ్ లా తీసుకోవడం వల్ల రుచి దొరుకుతుంది. డైట్ చేసే వారికి ఇవి చాలా మంచి ఫుడ్. బ్రేక్ ఫాస్ట్,లంచ్, డిన్నర్ టైమ్ లో కూడా తీసుకోవచ్చు. అలాగే కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసర్ల మొలకలు -2కప్స్
  2. క్యారెట్ తురుము -2స్పూన్స్
  3. కీరా ముక్కలు -2స్పూన్స్
  4. ఉల్లిపాయ ముక్కలు -2స్పూన్స్
  5. ఉప్పు -1/2స్పూన్
  6. కారం -1/2 స్పూన్
  7. ఆయిల్ -1/2స్పూన్
  8. ఎండుమిర్చి -1
  9. నిమ్మకాయ -1
  10. కొత్తిమీర -3రెమ్మలు

సూచనలు

  1. పెసలు 4గంటలు నానపెట్టి, ఓ గుడ్డలో కట్టుకోవాలి. రాత్రంతా అలా ఉంచితే తెల్లారి మొలకలు వచ్చేస్తాయి
  2. ముందుగా మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు వెయ్యాలి
  3. అవి వేగాక పెసలు వేసేయాలి. అలాగే కొన్ని నీళ్లు(10ml) పోసి మూత పెట్టాలి
  4. నీళ్లు ఆవిరి ఐపోయాక కుంచెం ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి
  5. మరొక 2నిముషాలు మూత పెట్టి, కలుపుతుండాలి
  6. స్టవ్ ఆఫ్ చేసి స్ప్రౌట్స్ ని సెర్వింగ్ బౌల్ లో వేసుకొని క్యారెట్, కీరా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండితే డిష్ రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర