ముల్లంగి క్యారెట్ సాంబార్ | Raadish,carrot,mixed dal sambar Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raadish,carrot,mixed dal  sambar recipe in Telugu,ముల్లంగి క్యారెట్ సాంబార్, మొహనకుమారి jinkala
ముల్లంగి క్యారెట్ సాంబార్by మొహనకుమారి jinkala
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

10

0

ముల్లంగి క్యారెట్ సాంబార్ వంటకం

ముల్లంగి క్యారెట్ సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raadish,carrot,mixed dal sambar Recipe in Telugu )

  • కందిపప్పు కప్
  • పెసరపప్పు కప్
  • ముల్లంగి అర కెజి
  • క్యారెట్ ఒకటి
  • చింతపండు నిమ్మకాయంత
  • సాంబార్ పొడి 3 స్పూన్లు
  • కారం ఒక స్పూన్
  • ఉప్పు తగినంత
  • పసుపు ఒక స్పూన్
  • ఉల్లిపాయముక్కలు కప్
  • టమాటో ముక్కలు కప్
  • 2 పచ్చిమిర్చి ముక్కలు
  • నూనె 4 స్పూన్లు
  • పోపు దినుసులు
  • దాల్చినచెక్క ఒక ముక్క
  • కరివేపాకు 2 రెమ్మలు
  • కొత్తిమీర కొద్దిగా
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • ఎండుమిర్చి 2
  • ఇంగువ హాఫ్ స్పూన్

ముల్లంగి క్యారెట్ సాంబార్ | How to make Raadish,carrot,mixed dal sambar Recipe in Telugu

  1. కందిపప్పు ,పెసరపప్పుకడిగి నానబెట్టుకొని కూకర్లో వేసి పసుపు కారం ఒక స్పూన్ సాంబార్ పొడి వేసి తగినన్ని నీరు పోసి ఉడికించి మెదిపి పెట్టుకోవాలి
  2. ఉడికించిన పప్పు
  3. చింతపండు కడిగి వేడి నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి
  4. ముల్లంగి క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసుకోవాలి
  5. స్టవ్ వెలిగించి గిన్నీ పెట్టి నూనె వేసి వేడయ్యాక దాల్చినచెక్క వేసి వెలుల్లి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి
  6. వేగాక
  7. ఇంగువ వేసి
  8. ముల్లంగి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయముక్కలు వేసి
  9. కళ్లుఉప్పు తగినంత వేసి కలిపి మూటపెట్టి 10 నిమిషాలు మగ్గించాలి
  10. టొమాటముక్కలు వేసి కలిపి మగ్గించాలి
  11. ముక్కలు మగ్గాక చింతపండు రసం వేసి 5 నిమిషాలు ఉడికాక తగినన్ని నీరు వేసి ఉడికించాలి
  12. మెదపిన పప్పు వేసి కలిపి
  13. సాంబార్ పొడి వేసి ఉడికించాలి
  14. కొత్తిమీర చల్లి సాంబార్ తెల్లె వరకూ ఉడికించాలి
  15. ఘుమఘుమలాడే ముల్లంగి సాంబార్ రెడి
  16. ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

నా చిట్కా:

మనకు ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు

Reviews for Raadish,carrot,mixed dal sambar Recipe in Telugu (0)