హోమ్ / వంటకాలు / పచ్చి బఠాని పనీర్ మసాలా కూర

Photo of Paneer peas gravy masala by Lalitha Kandala at BetterButter
521
4
0.0(0)
0

పచ్చి బఠాని పనీర్ మసాలా కూర

Feb-28-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి బఠాని పనీర్ మసాలా కూర రెసిపీ గురించి

పనీర్ లో మరియు బఠాని లో ప్రోటీన్ విలువలు ఎక్కువ గా ఉంటాయి. వీటితో కూర బిర్యానీ, రోటీ ల్లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పనీర్ ముక్కలు 20
  2. పచ్చి బఠాని 1 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు 2 కప్స్
  4. టమాటో ముక్కలు 2 కప్స్
  5. జీడిపప్పు 10
  6. అల్లం, వెల్లుల్లి ముద్ద 1 tabl స్పూన్
  7. జీలకర్ర 1 tabl స్పూన్
  8. దాల్చిన చెక్క చిన్నది
  9. యాలకులు 4
  10. బిర్యానీ ఆకులు 2
  11. క్రీమ్ నచ్చితే 2 టేబుల్ స్పూన్స్
  12. ఉప్పు కొద్దిగా
  13. కారం 1/2 టేబుల్ స్పూన్
  14. పసుపు చిటికెడు
  15. నూనె 4 చెంచాలు
  16. బంగాళా దుంప ముక్కలు 1/2 కప్
  17. గరం మసాలా 1 tabl స్పూన్
  18. దనియా జీర పొడి అర టీ స్పూన్
  19. కసూరి మేథీ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పాన్ లో నూనె వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయముక్కలు , టొమోటో ముక్కలు వేసి వేగాక జీడిపప్పు తో కలిపి చల్లార్చి మెత్తగా ముద్దగా చేయాలి
  2. అదే పాన్ లో నూనె వేసి జీర, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, టొమోటో ముక్కలు వేసి బాగా కలపాలి
  3. ఉప్పు, పసుపు, కారం, మసాలా, దనియా జీర పొడి వేసి బాగా కలపి మూత పెట్టాలి
  4. దగ్గర పడ్డాక ఉల్లిముద్ద కూడా వేసి బాగా కలిపి పచ్చి బఠాని ఉడికించి లేదా ఒవేన్ లో 5 నిమిషాలు పెట్టి మెత్తగా అయ్యాక ఇందులో కలపాలి.
  5. బంగాళా దుంప ముక్కలు కూడా వేసి కలిపి ఉడికించాలి
  6. నీళ్లు పోసి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి
  7. దగ్గర పడ్డాక క్రీమ్ నచ్చితే వేయాలి
  8. పన్నీర్ ముక్కలు కూడా వేసి కలపి పైన కసూరి మేథీ కొద్దిగా వెయ్యాలి
  9. దింపే ముందు కొత్తిమీర జల్లి రోటీ లేదా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లోకి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర