హోమ్ / వంటకాలు / క్రిస్పీ కార్న్

Photo of Crispy corn by Rashmi SudhiMurthy at BetterButter
914
2
0.0(0)
2

క్రిస్పీ కార్న్

Mar-04-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ కార్న్ రెసిపీ గురించి

మొక్కజొన్నలు క్రిస్పీ గా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు లేదా పిల్లలకు స్నాక్స్ లాగా వెంటనే చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మొక్కజొన్నలు(స్వీట్ కార్న్) 1 కప్
  2. కార్న్ ఫ్లోర్ 2- 3 టేబుల్ స్పూన్లు
  3. కారం పుడి 1 టీ స్పూన్
  4. తరిగిన అల్లం వెల్లుల్లి 1/2 టీ స్పూన్
  5. గరం మసాలా 1 టీ స్పూన్
  6. చాట్ మసాలా 1 టీ స్పూన్
  7. తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా మొక్కజొన్నల్ని బాగా మరిగే నీళ్ల లో వేసి 3 నిమిషాలు ఉడికించాలి
  2. ఉడికించిన మొక్కజొన్నల్ని తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్,గరం మసాలా, ఉప్పు,కారంపుడి,తరిగిన అల్లం వెల్లుల్లి, అవసరం అయితే కొంచెం నీళ్ళు వేసి గట్టిగా కలపాలి
  3. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న మొక్కజొన్నల్ని నూనెలో వేసి క్రిస్పీగా వేయించాలి.వేయించేటప్పుడు మొక్కజొన్నలు పేలే ప్రమాదం ఉంది కాబట్టి మూత పెట్టి వేయించాలి
  4. వేయించిన మొక్కజొన్నలు పేపర్ పైన తీసుకోవాలి
  5. ఇప్పుడు ఇందులో చాట్ మసాలా, కొత్తిమీరతరుగు వేసి కలపాలి, కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు
  6. వేడి వేడి క్రిస్పీ కార్న్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర