వెజిటబుల్ ఉప్మా | Vegetable Upma Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  4th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vegetable Upma by Gadige Maheswari at BetterButter
వెజిటబుల్ ఉప్మాby Gadige Maheswari
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

12

0

వెజిటబుల్ ఉప్మా వంటకం

వెజిటబుల్ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Upma Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ - 1 పెద్ద గ్లాసు
  • క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ముక్కలు - 1 కప్
  • ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  • టోమాటో ముక్కలు - 1/2 కప్
  • పచ్చిమిర్చి ముక్కలు - 2 స్పూన్
  • ఉప్పు రుచికి తగినంత
  • నీరు - 3 గ్లాసు
  • పోపు కోసం :
  • జీలకర్ర - 1/2 స్పూన్
  • ఆవాలు - 1/2 స్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • శనగపప్పు - 1 స్పూన్
  • కొత్తిమీర తరుగు కొద్దిగా
  • నూనె - 1/2 కప్
  • నెయ్యి - 2 స్పూన్
  • పసుపు చిటికెడు
  • నిమ్మరసం - 2 స్పూన్

వెజిటబుల్ ఉప్మా | How to make Vegetable Upma Recipe in Telugu

  1. ముందుగా నీళ్ళు మరిగించి పెట్టుకోవాలి
  2. ఒక పాత్రలో నెయ్యి నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  3. ఆ తర్వాత టొమాటో ముక్కలు పసుపు వేసి వేయించాలి.
  4. ఇందులో రవ్వను కూడా వేసి బాగా వేయించాలి.
  5. ఆ తర్వాత మరిగించి పెట్టుకోన్న నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
  6. నీరు దగ్గర పడ్డాక కోత్తీమీర తరుగు నిమ్మరసం వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Reviews for Vegetable Upma Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo