హోమ్ / వంటకాలు / గోధుమ నూక పాయసం

Photo of Broken wheat kheer by Rashmi SudhiMurthy at BetterButter
687
3
0.0(0)
0

గోధుమ నూక పాయసం

Mar-10-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ నూక పాయసం రెసిపీ గురించి

ఈ పాయసం కొబ్బరిపాల తో చేస్తారు.ఇది దక్షిణ కర్ణాటకలో ఎక్కువగా చేస్తారు.చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యకరం

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • కర్ణాటక
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ నూక 1 కప్
  2. బెల్లం 1 కప్
  3. 5 నిమిషాలు నాన బెట్టిన బియ్యం 1 స్పూన్
  4. పచ్చికొబ్బరి పాలు 2 కప్పులు
  5. లవంగా 4
  6. యాలుకల పొడి 1/2 టీ స్పూన్
  7. నీళ్ళు సరిపడా
  8. గార్నిష్ చేయడానికి జీడిపప్పు 1 టీ స్పూన్
  9. నెయ్యి జీడిపప్పు వేయించడానికి

సూచనలు

  1. ముందుగా పచ్చికొబ్బరి తురుము లో ఒక స్పూన్ నాన బెట్టిన బియ్యం వేసి మిక్సీ లో గ్రైండ్ చేసి కొబ్బరిపాల ను సిద్ధం చేసుకోవాలి
  2. గోధుమ నూకను 2 కప్పులు నీళ్ళు వేసి కుక్కర్ లో ఉడికించాలి
  3. బెల్లం తురుముకొని ఒక కప్ నీళ్ళు వేసి స్టవ్ పైన కరిగించాలి
  4. ఇప్పుడు అందులో ఉడికించిన గోధుమ నూక,లవంగాలు వేసి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించాలి
  5. ఇప్పుడు కొబ్బరి పాలు వేసి 5 నిమిషాలు మరిగించి చివరిగా యాలుకల పొడి వేసి నేతిలో వేయించిన జీడిపప్పు తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర