చట్నీ పొడి | CHUTNEY POWDER Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  11th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of CHUTNEY POWDER by Rashmi SudhiMurthy at BetterButter
చట్నీ పొడిby Rashmi SudhiMurthy
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

12

0

చట్నీ పొడి వంటకం

చట్నీ పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHUTNEY POWDER Recipe in Telugu )

 • ఎండు మిరపకాయలు బ్యాడిగి 20
 • ఎండు కొబ్బరి 1 చిప్ప
 • వెల్లుల్లి రెబ్బలు 10( తొక్క తో పాటు)
 • ధనియాలు 1/4 టీ స్పూన్
 • మెంతులు చిటికెడు
 • జీలకర్ర 1/4 టీ స్పూన్
 • శెనగపప్పు 1 టేబుల్ స్పూన్
 • కరివేపాకు 20
 • చింతపండు చిన్న నిమ్మకాయ అంత
 • బెల్లం తురుము 1 టీ స్పూన్
 • ఉప్పు రుచికి సరిపడా
 • నూనె 1 టేబుల్ స్పూన్

చట్నీ పొడి | How to make CHUTNEY POWDER Recipe in Telugu

 1. ఒక పాన్ లో నూనె వేడిచేసి ఎండు మిరపకాయలు వేయించి పక్కన పెట్టాలి
 2. ఎండు కొబ్బరి ని ముక్కలు గా చేసుకుని అదే పాన్ లో వేసి కొంచెం వేయించాలి (రంగు మరకూడదు)
 3. వెల్లుల్లి ని కొంచెం గాట్లు పెట్టి ఒక సారి వేడి పాన్ మీద వేసి రంగుమరకుండా వేయించి పెట్టుకోవాలి
 4. ఇప్పుడు శెనగపప్పు,ధనియాలు, మెంతులు,జీలకర్ర,కరివేపాకు,చింతపండు అన్ని దోరగా వేయించాలి(నూనె మళ్ళీ వేయనవసరం లేదు)
 5. మిక్సీలో వేయించిన మిరపకాయలు ఉప్పు వేసి ఒక సారి రుబ్బుకొని,కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసి మళ్ళీ మిగిలిన వన్నీ వేసి బరకగా రుబ్బుకోవాలి
 6. అంతే ఎంతో రుచికరమైన చట్నీ పొడి రెడీ. కొంచెం చల్లబడ్డ తరువాత బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోవచ్చు

నా చిట్కా:

వేయించేది ఎక్కువైన, తక్కువైనా టేస్ట్ మరియు రంగు మారుతుంది

Reviews for CHUTNEY POWDER Recipe in Telugu (0)