హోమ్ / వంటకాలు / కాకర కాయ స్టఫ్డ్ కూర

Photo of Stuffed bitter gourd curry by దూసి గీత at BetterButter
565
4
0.0(0)
0

కాకర కాయ స్టఫ్డ్ కూర

Mar-20-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకర కాయ స్టఫ్డ్ కూర రెసిపీ గురించి

చేదైన కాకరకాయ చాలామంది ఇష్టపడరు కానీ, కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రకంగా చేస్తే పిల్లలు కూడా కాకరకాయ ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు- 6
  2. ఉల్లిపాయలు - 2
  3. టమాటా- 1
  4. శనగపిండి- 1/2 కప్పు.
  5. ధనియాలపొడి- 1/2 చెంచా.
  6. ఉప్పు- 1/2 చెంచా.
  7. ఖారం- 1/2 చెంచా.
  8. నూనె - 1/4 కప్పు.

సూచనలు

  1. మరుగుతున్న నీళ్ళలో ఉప్పు వేసి కాకరకాయలు 5 నిమిషాలు ఉడికించాలి.
  2. మూకుడులో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించాలి.తర్వాత టమాటా కూడా వేసి వేయించాలి. తర్వాత ఉప్పు,పసుపు, శనగపిండీ,ధనియాల పొడీ వేసి 2 నిమిషాలు వేయించాలి.
  3. కాకరకాయలు ఒకవైపు నిలువుగా చీల్చి, శనగపిండి మిశ్రమం స్టఫ్ చేసి 10 నిముషాల పాటు వేయించాలి.
  4. స్టఫింగ్ మిశ్రమం మిగిలితే అది కూడా వేసి వేయించి, కొద్దిగా నీళ్ళు చల్లి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర