హోమ్ / వంటకాలు / వెజ్జీ నాచోస్

Photo of veggie Nachos by Himabindu at BetterButter
1
4
0.0(0)
1

వెజ్జీ నాచోస్

Mar-21-2019
Himabindu
10 నిమిషాలు
వండినది?
13 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్జీ నాచోస్ రెసిపీ గురించి

నాచోస్ తో చాల సింపుల్ గ టేస్టీగ చేసుకోవచ్చు...చీజీగ ఇష్ట పడేవారికి ఇది బాగ నచ్చుతుంది,త్వరగ రెడీ చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • వేగన్

కావలసినవి సర్వింగ: 3

 1. 100 గ్రాములు- నాచో చిప్స్
 2. 1 కప్ - బ్రౌన్ లెన్టిల్
 3. 1 కప్ - చెడార్ చీజ్
 4. 1 కప్ - మొజరెల్ల చీజ్
 5. 1/2 కప్- ఉల్లిపాయ
 6. 1/2 కప్- టొమాటో
 7. 1/2 కప్- కాప్సికమ్
 8. 2 చెంచా- కొతిమీర
 9. 2 చెంచా- స్వీట్ చిల్లీ సాస్
 10. 1/4 చెంచా- అరెగనొ
 11. 2 చెంచా- మిరియాల పొడి
 12. ఉప్పు రుచికి సరిపడినంత

సూచనలు

 1. మొదటగ 1 కప్ బ్రౌన్ లెన్టిల్ ప్రెజర్ కుక్కర్ లోకి తీసుకొన 2 సార్లు కడగండి.ఇప్పుడు 1 కప్ కి 3 కప్స్ నీరు పొసి స్టవ్ వెలిగించి 8 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలి.
 2. ఇప్పుడు ఉల్లిపాయ,టొమాటో,కాప్సికమ్,కొతిమీర అన్నీ తరిగి ఒక బౌల్ లోకి తీసుకోండి.
 3. ఇప్పుడు మిరియాల పొడి,ఉప్పు(రుచికి సరిపడ),అరెగనొ,స్వీట్ చిల్లీ సాస్, వీటన్నింటిని వెజిటెబుల్స్ పెట్టుకున్న బౌల్ లోకి తీసుకోని అన్నింటిని బాగా కలిపి పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని ట్రే లొ మొదట నాచో చిప్స్ ని అమర్చుకోవాలి.
 5. తరువాత చిప్స్ మీద పావు వంతు చెడార్ చీజ్,మొజరెల్ల చీజ్ ని చల్లుకోవాలి.
 6. ఇప్పడు చల్లుకున్న చీజ్ మీద ఉడికించుకున్న లెన్టిల్ 3 చెంచాలు చల్లుకోవాలి.
 7. ఇప్పడు లెన్టిల్ మీద కలిపి పెట్టుకున్న వెజిటెబుల్ మిశ్రమాన్ని చల్లుకోవాలి.
 8. ఇప్పుడు వెజిటెబుల్ మిశ్రమం మీద మిగిలిన చెడార్ చీజ్, మొజరెల్ల చీజ్ చల్లుకొండి.
 9. ఇప్పుడు ఆ ట్రే ని ఒవెన్ లొ 3 నిమిషాలు పెట్టి తీయండి అంతే ఎంతో టేస్టీగ ఉండె వెజ్జీ నాచోస్ రెడీ.సౌర్ క్రీమ్ తొ సర్వ్ చేసుకుంటె చాల రుచిగ ఉంటుంది.
 10. (బ్రౌన్ లెన్టిల్ వద్దు అనుకునేవారు లెన్టిల్ లేకుండ కేవలం వెజిటెబుల్స్తొ కూడా చేసుకోవచ్చు)

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర