హోమ్ / వంటకాలు / 9రకాల చద్దులు (పులిహోరలు)

Photo of 9types of pulihora by kalyani shastrula at BetterButter
1906
13
0.0(0)
0

9రకాల చద్దులు (పులిహోరలు)

Mar-22-2019
kalyani shastrula
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

9రకాల చద్దులు (పులిహోరలు) రెసిపీ గురించి

పులిహోరలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ

కావలసినవి సర్వింగ: 5

  1. ఉడికించి పెట్టుకున్న అన్నం 10 కప్స్ ( కిలో)
  2. బెల్లం తురుము పావు కప్పు
  3. ఇలాయిచి 1
  4. కాజు 10
  5. మిర్యాల పొడి స్పూన్
  6. శొంఠి పొడి పావు స్పూన్
  7. నెయ్యి 1tbsn
  8. పాలు ఒక కప్
  9. పెరుగు ఒక కప్
  10. ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు 3tbsn
  11. వేయించి పొడికొట్టుకున్న నువ్వుల పొడి సగం కప్
  12. పచ్చి కొబ్బరి తురుము ఒక కప్
  13. ఒక నిమ్మకాయ రసం
  14. పుల్లని దానిమ్మ పండు ఒలిచి మీక్సీ చేసుకున్న రసం సగం కప్
  15. ఉసిరి ముద్ద సగం కప్
  16. నూనె పోపు కు అన్నింటికీ సరిపడా
  17. 10ఎండుమిర్చి
  18. 10పచ్చిమిర్చి
  19. 3tbsn ఆవాలు
  20. 3tbsn.జిలకర
  21. 3tbsn పసుపు
  22. 3tbsn ఇంగువ
  23. కరివేపాకు 5రెమ్మలు
  24. కొత్తిమీర 3కట్టలు
  25. పల్లీలు రెండు గుప్పిళ్ళు
  26. ఒక మామిడికాయ తురుము
  27. అన్నింటికీ సరిపడా ఉప్పు

సూచనలు

  1. మొదలు అన్నం వండి తొమ్మిది గిన్నెలలో పెట్టుకోవాలి . అన్నం అయ్యేలోపు 1. చింతపండు మీక్సీ చేసి ఉడికించి పెట్టుకోవాలి . 2.మామిడి చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి 3.కొబ్బరి తురిమిపెట్టుకోవాలి 4. నిమ్మ కాయ రసం పిండిపెట్టుకోవాలి 5.ఉసిరి మీక్సీ చేసి పెట్టుకోవాలి 6.పుల్ల దానిమ్మ గింజలు మీక్సీ చేసి రసం తీసి పెట్టుకోవాలి . 7.పెరుగు రెడీ గ ఉంచుకోవాలి 8.పాలలో పొయ్యి మీద కాగబెట్టుకోవాలి 9.పెసరపప్పు వేయించి పొడికొట్టుకోవాలి .ఇవన్నీ పొడులు store చేసి పెట్టుకోవచ్చు .
  2. ఇప్పుడు అన్నింటికి సరిపడా పోపుకు నూనె వేసుకొని ఎండుమిర్చి ,పచ్చిమిర్చి పల్లీలు ,ఆవాలు శెనగపప్పు ,మినప్పప్పు ,జిలకర పసుపు ఇంగువ కరివేపాకు కొత్తిమీర వేసి 7 బౌల్ లో ఉన్న అన్నం లో వేయాలి .అన్నింటిలో తగినంత ఉప్పు వేసి కలిపి ఒకదానిలో చింతపండు గుజ్జు , 2వ దానిలో ,నిమ్మరసం 3వ దానిలో దానిమ్మరసం 4వ దానిలో నువ్వులపొడి 5వ దానిలో పెసర పొడి , 6వ దానిలో మామిడికాయ తురుము 7వ దానిలో పచ్చికొబ్బరి తురుము వేసి అన్ని కలుపుకుంటూ ఇలా 7పులిహోరలు కలపాలి .
  3. ఇవన్నీ కలిపే లోపు 8వ బౌల్ లో ఉన్న అన్నము లో బెల్లం తురుము వేసి స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి .అందులో కాగబెట్టిన పాలు ,ఇలాయిచి పొడి వేసి ఆవునేతిలో వేయించిన కాజును నేతితో సహా వేసి కలపాలి . 9వ బౌల్ లో ఉన్న అన్నము లో పెరుగువేసి ,శొంఠి మిరియాల పొడి ,ఉప్పు వేసి ఆవునేతి పోపులో ఆవాలు ,జిలకర ,కరివేపాకు ,కాజు ,వేసి కలిపి కొత్తిమీర ,పచ్చిమిర్చిచిన్నగా తరిగిన ముక్కలు వేసి కలపాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర