హోమ్ / వంటకాలు / Milk Poori /Milk poli

Photo of Milk Poori /Milk poli by Swapna Sunil at BetterButter
479
13
0.0(0)
0

Milk Poori /Milk poli

Mar-24-2019
Swapna Sunil
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • హోలి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1.5 కప్పులు : ఉప్మా రవ్వ
  2. 3 టేబుల్ స్పూన్లు : మైదా పిండి
  3. 3 టీ స్పూన్లు : కరిగించిన నెయ్యి
  4. 1/4 స్పూన్ : ఉప్పు
  5. గోరువెచ్చని నీళ్లు సరిపడా
  6. వేయించటానికి నూనె
  7. 4 కప్పులు : మీగడ పాలు
  8. 1.5 కప్పు : చెక్కర
  9. చిటికెడు : కుంకుమ పువ్వు
  10. 2 స్పూన్లు : వేయించిన పలుకులు (ఇష్టానుసారం)

సూచనలు

  1. ఒక తాంబాలం లో ఉప్మా రవ్వ,మైదా పిండి, ఉప్పు, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి.
  2. సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండి ముద్ద కలుపుకోండి.
  3. తడి గుడ్డ కప్పి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి.
  4. గంట తరువాత కొన్ని నీళ్లు చల్లుకుని రెండు నిమిషాలు పిండిని మర్దనా చేయండి.
  5. చిన్న చిన్న ఉండలు తుంచుకొని, పొడి పిండి చల్లుకుంటూ పల్చటి పూరీలు వత్తుకోండి.
  6. వేయించటానికి నూనె వేడి చేసుకొని పూరీలను లేత బంగారు వచ్చే వరకు వేయించుకోండి.
  7. వేయించిన పూరీలు టిష్యూ పేపర్లు పరిచిన ప్లేటులో వేసుకొని నూనె పీల్చటానికి,అలాగే కాస్త చల్లారాటానికి వదిలేయండి.
  8. ఈ లోపు ఇంకో పొయ్యి మీద మీగడ పాలను ఒక పొంగు రానిచ్చి అందులో చెక్కర, కుంకుమ పువ్వు వేసుకొని ఒక పది నిమిషాలు మరిగించండి.
  9. ఆరిన పూరీలను ఒక వెడల్పాటి గిన్నెలో మడుచుకొని వరుసగా అమర్చుకొని మరిగించిన కుంకుమ పాలను పోసుకొని ఒక అర గంట పాటు నాన నివ్వండి.
  10. పూరీలు తీపి పాలను పీల్చుకుని కాస్త మెత్త బడి మధురంగా మారుతాయి.
  11. ఇప్పుడు వేయించిన పలుకులతో అందంగా అలంకరించి మీ బంధు మిత్ర సపరివారంతో ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర