హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ కారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ (కుక్కర్లో)

Photo of INSTANT Caramel bread pudding (In Cooker) by Prathyusha Mallikarjun at BetterButter
588
6
0.0(0)
0

ఇన్స్టంట్ కారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ (కుక్కర్లో)

Mar-31-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ కారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ (కుక్కర్లో) రెసిపీ గురించి

ఇది భోజనం తర్వాత తినే ఒక డిజెెర్ట్ ఐటమ్ పుడ్డింగ్ చల్లగా కానీ వేడిగా కానీ తీస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పంచదార - 1 కప్పు
  2. బ్రెడ్ ముక్కలు - 6
  3. కుంకుమపువ్వు - చిటికెడు
  4. పాలు - 1 టీ గ్లాస్
  5. యాలుకులు - 2
  6. డ్రై ఫ్రూట్స్ - అలంకరణకు
  7. కస్టర్డ్ పొడి - 1 స్పూను
  8. నెయ్యి - 1 స్పూను

సూచనలు

  1. ముందుగా బ్రెడ్డుని అంచులు కత్తిరించి ముక్కలు చేసి పొడి కొట్టుకోవాలి.
  2. ఒక కడాయిలో పంచదార వేసి కరగనిచ్చి లైట్ బ్రౌన్ రంగు రానిచ్చి ఒక గిన్నీలో వేసుకొని అడుగున పరుచుకోవాలి.
  3. ఇప్పుడు మరొక గిన్నీలో పాలు మరగనిచ్చి చిటికెడు కుంకుమపువ్వు, యాలుకులు పొడి వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు కొంచం నీటిలో కస్టర్డ్ పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  5. మరిగే పాలల్లో కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
  6. ఇప్పుడు కొంచం కొంచం బ్రెడ్ పొడి వేసి దగ్గరగా ఉడికించుకోవాలి.
  7. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పరిచిన కారమిల్ మీద వేసి పైన తడి స్పూను తో సమానంగా పరుచుకోవాలి.
  8. ఇప్పుడు కూకర్లో నీరు వేసి స్టాండ్ పెట్టి మిశ్రమాన్ని వేసిన గిన్నె పెట్టి 2 కూతలు వచ్చే వరకు ఉంచి ఆపుకోవాలి.
  9. ప్రెజర్ పోయాక ఒక ప్లేట్ పైన గిన్నెను బోర్లించుకోవాలి.
  10. ఇప్పుడు కింద బ్రెడ్ పుడ్డింగ్ పైన కారమిల్ సిరప్ తో వేడిగా రుచికరమైన పుడ్డింగ్ సిద్ధం.
  11. పైన మనకు నచ్చిన డ్రైఫ్రూట్స్ తో అలంకరించుకోవాలి.
  12. అంతే దీనిని చల్లగా కావాలి అంటే ఫ్రిడ్జిలో పెట్టి తీసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర