క్రిప్సి మసాలా పల్లి పకోడీ | Cripsy masala peanut pakora Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  31st Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Cripsy masala peanut pakora by Anitha Rani at BetterButter
క్రిప్సి మసాలా పల్లి పకోడీby Anitha Rani
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

14

0

క్రిప్సి మసాలా పల్లి పకోడీ వంటకం

క్రిప్సి మసాలా పల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cripsy masala peanut pakora Recipe in Telugu )

  • పల్లీలు/వేరుశనగ పప్పులు 1కప్
  • శనగ పిండి 1/4కప్
  • బియ్యపు పిండి 1 స్పూన్
  • దనియ పొడి 1టేబుల్ స్పూన్
  • మిరియాల పొడి 1/2 స్పూన్
  • ఉప్పు సరిపడా
  • ఎండు కారము మిరప్పొడి 1 టేబుల్ స్పూన్
  • నూనె వేయించడానికి సరిపడా
  • గరంమసాలా1/4స్పూన్
  • కొత్తిమీర తరుగు కొద్దిగా

క్రిప్సి మసాలా పల్లి పకోడీ | How to make Cripsy masala peanut pakora Recipe in Telugu

  1. ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి,బియ్యపు పిండి,ఉప్పు,కారము,ధనియాలపొడి,గరంమసాలా అన్ని కలుపుకోవాలి.
  2. మిశ్రమములో పల్లీలు వేసి ,2స్పూన్స్ వేడి నూనె వేసి బాగా కలపాలి.
  3. సరిపడా నీరు వేసి పకోడీ పిండి లాగా కలపాలి.
  4. చివరగా చిన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమీర వేసి కలుపు కోవాలి.
  5. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి అయ్యాక పకోడీ మిశ్రమము కొద్ది కొద్దిగా వేసుకోవాలి.
  6. రెండు వైపులా కర,కర లాడే వరకు వేపు కున్నాక టిష్యు పేపర్ పైన వేసుకోవాలి.
  7. చల్లారిన తరువాత గాలి చొరని డబ్బా లో ఉంచుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి.
  8. కరకరలాడుతూ తినడానికి రుచిగా ఉంటాయి,మన ఇంటికి వచ్చిన అతిథులకు టీ తో పాటు పెట్టొచ్చు.

నా చిట్కా:

పిండిలో కొద్దిగా వేడి నూనె పోసి కలుపుకుంటే పల్లీ పకోడీలు కరకర లాడుతూ ఉంటాయి.

Reviews for Cripsy masala peanut pakora Recipe in Telugu (0)