హోమ్ / వంటకాలు / గుమ్మడికాయ రోల్ పాటిస్ మరియు గుమ్మడికాయ స్ప్రింగ్ రోల్స్.

Photo of Pumpkin roll patties and pumpkin rolls by Swapna Sashikanth Tirumamidi at BetterButter
25
4
0.0(0)
0

గుమ్మడికాయ రోల్ పాటిస్ మరియు గుమ్మడికాయ స్ప్రింగ్ రోల్స్.

Mar-31-2019
Swapna Sashikanth Tirumamidi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుమ్మడికాయ రోల్ పాటిస్ మరియు గుమ్మడికాయ స్ప్రింగ్ రోల్స్. రెసిపీ గురించి

గుమ్మడికాయ తో రోల్స్,పాటిస్ అనగానే ఆశ్చర్యంగావుందికదా.చేసి తినేవరకూ నాదికూడా అదే భావన.ఇలాకూడా చెయ్యచ్చు అని తిన్నాక గాని తెలియలేదు.అంత రుచి గా ఉన్నాయి.ముఖ్యం గా గుమ్మడికాయ అంటే చిన్నచూపు(ఇష్టంలేనివారికి) ఉన్నవారికి ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారు.ఇది యదార్ధం. ఇక్కడ రెండు రకాలు ఎందుకు పెట్టాను అంటే అదే స్టఫ్ ని ఉయోగించి రెంరకలుగా చేసాను కాబట్టి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు.మంచి ఆరోగ్య కరమైన అల్పాహారం.స్నాక్స్ లా తినవచ్చు.పిల్లలకు లంచ్ బాక్సులో పెట్టవచ్చు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • కలయిక
 • మితముగా వేయించుట
 • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. సన్నగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు 2 పెద్ద కప్పులు.
 2. సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు ఒకకప్పు.
 3. ఫ్రోజెన్ పచ్చ బఠాని లు అరకప్పు
 4. క్యారెట్ కోరు ఒక కప్పు
 5. పన్నీర్ కోరు 2 చెంచాలు(ఆప్షనల్)
 6. పచ్చిమిర్చి ముక్కలు ఒక చెంచాడు
 7. అల్లం ముక్కలు ఒకచెంచాడు
 8. ఆవాలు అరచెంచా
 9. జీలకర్ర ఒకచెంచా
 10. గరం మసాలా పొడి అరచెంచా
 11. ఉప్పు తగినంత.
 12. కొత్తిమీర 3 చెంచాలు.
 13. నూని షాలో ఫ్రై కి .. తగినంత
 14. నెయ్యి 2 చెంచాలు
 15. గోధుమ పిండి 1 కప్పు
 16. స్ప్రింగ్ రోల్ షీట్ లు 6

సూచనలు

 1. గోధుమపిండిని సరిపడా ఉప్పు,నూని ,నీళ్లు వేసి చపాతీ పిండిలా బాగా కలిపి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
 2. ఫ్రోజెన్ బఠాణీలు నీటిలోవేసి ఉంచుకోవాలి.
 3. ఇప్పుడు వెడల్పుమూకుడు పెట్టి నూని వేసి ఆవాలు వేయించాలి,తరువాత జీలకర్ర, అల్లం,పచ్చి మిర్చి, గరంమసాలా పొడి,ఉల్లి ముక్కలు,కొద్దిగా ఉప్పు వరుసగా వేసి వేయించాలి 2 నిమిషాలు పాటు .
 4. ఇప్పుడు సన్నగా కోరిన/తరిగిన గుమ్మడి ముక్కలు వేసి, ఫ్రోజెన్ బఠానిలు నీరు పూర్తిగా తీసేసి వెయ్యాలి .,క్యారెట్ కోరు ,కొంచం ఉప్పు కూడవేసి మూత లేకుండా 4 నిమిషాలు మగ్గించి కొత్తిమీర వేసి కలిపి దించుకోవాలి.(ఫ్రోజెన్ పీస్ అవడంవల్ల ఇంకా గుమ్మడిని సన్నగా తరుగుతాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయి.ఒకవేళ పూర్తిగా మగ్గకపోయినా పరవాలేదు,మళ్ళీ షాలో ఫ్రై చేస్తాం కాబట్టి )
 5. కూర మగ్గే వ్యవధిలో చపాతీ పిండి తీసుకుని పెద్ద చపాతీలా వత్తి నెయ్యిరాసి పెట్టుకోవాలి.స్ప్రింగ్ రోల్ షీట్లు కూడా ఫ్రిడ్జ్ లోంచి తీసి పెట్టుకోవాలి(స్ప్రింగ్ రోల్ షీట్లు కొన్నవే వాడాను)
 6. కూర అవ్వగానే ఆ కూరని ఎక్కువ మొత్తం లో తీసుకుని వత్తిన చపాతీ లో ఒకపక్కగా పెట్టి, పైన పన్నీర్ కోరు వేసి జాగర్తగా చుట్టాలి.(టైం ఎక్కువగా ఉంటే 2 లేదా 3 చపాతీలు దొంతరగా పెట్టుకుని కూర పెట్టుకోవచ్చు.)
 7. ఇప్పుడు ఈ పెద్ద చుట్టని ముక్కలుగా కోసుకోవాలి.
 8. ఇప్పుడు పాన్ పెట్టి పెద్ద గరిటడు నూని వేసి వేడిచెయ్యాలి.అది కాగే లోపు కోసిన ముక్కల్ని ఒక్కొక్కటిగా అరచేతిలో పెట్టుకుని మరో అరచేతి సాయంతో మెల్లగా వత్తి నూనెలో వెయ్యాలి.ఇలా అన్ని వత్తి నూనెలో వెయ్యాలి.ఒకపక్క వేగాక మరోపక్కకి తిప్పి మాడి పోకుండా వేయించి పళ్ళెంలోకి తీసుకోవాలి.చెరోపక్క ఒక్కొక్క నిమిషం కన్నా టైం పట్టదు వేగడానికి.
 9. ఇప్పుడు అదే కూరని స్ప్రింగ్ రోల్ షీట్ల్లో కూడా చుట్టుకుని దోరగా వేయించుకోవాలి.(పాన్ పెద్దది ఐతే రెండు రకాలు ఒక్కసారిగా వేయించవచ్చు).
 10. అంతే అండి యమ్మీ యమ్మీ,సూపర్ డూపర్ గుమ్మడి రోల్ పాటిస్ మరియు గుమ్మడి స్ప్రింగ్ రోల్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర