హోమ్ / వంటకాలు / గుడ్డు బిర్యానీ

Photo of Egg Biryani by Gadige Maheswari at BetterButter
51
0
0.0(0)
0

గుడ్డు బిర్యానీ

Apr-05-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు బిర్యానీ రెసిపీ గురించి

గుడ్డుతో చెసిన బిర్యానీ. ఇలా బిర్యానీ చేస్తే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • చిన్న మంట పై ఉడికించటం
 • ఉడికించాలి
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. ఉడికించిన కోడిగుడ్లు - 7
 2. సొనమసూరి బియ్యం - 1/4 కెజీ
 3. బాసుమతి బియ్యం - 1 కప్
 4. కొత్తిమీర కట్ట - 2
 5. పుదీనా కట్ట - 1
 6. ఉప్పు రుచికి తగినంత
 7. నూనె ఒక కప్పు
 8. నెయ్యి 4 స్పూన్
 9. కారం 1 స్పూన్
 10. పసుపు 1 స్పూన్
 11. ధనియాలపొడి పొడి 2 స్పూన్
 12. బిర్యానీ మసాలా 1 స్పూన్
 13. పచ్చిమిర్చి 4
 14. ఉల్లిపాయలు 3
 15. అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్
 16. టేస్టీంగ్ సాల్ట్ 1 స్పూన్
 17. నిమ్మరసం 4 స్పూన్
 18. ఫుడ్ కలర్ 2 రకాలు
 19. పెరుగు ఒక కప్పు
 20. మసాలా దినుసులు :
 21. దాల్చిన చెక్క 2
 22. లవంగాలు 2
 23. యాలకులు 2
 24. బిర్యానీ ఆకు 2
 25. అనాసపవ్వు 1

సూచనలు

 1. ఉడికించిన కోడిగుడ్లు పెంకు తీసి వాటి చుట్టూ గాట్లు పెట్టుకోవాలి.
 2. నిమ్మరసంలో విడి విడిగా ఫుడ్ కలర్ కలిపి ఉంచుకోవాలి. నేను ఇక్కడ రెండు రకాలు కలర్స్ తీసుకున్నాను. లెమన్ ఎల్లో ఇంకా కేసరి కలర్.
 3. బియ్యం కడిగి నానబెట్టాలి. ఉల్లిపాయలను పచ్చిమిర్చిని పొడవునా కట్ చేసుకోవాలి.
 4. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో ఉప్పు కారం పసుపు ధనియాలపొడి వేసి గుడ్లు వేసి మసాలా బాగా పట్టేలా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
 5. మరొక బాణలిలో 1 స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర మసాలా దినుసులు కొన్ని వేసి వేయించాలి.
 6. అందులో తగినంత నీరు ఉప్పు వేసి బాగా మరిగించి బియ్యం వేసి 80% ఉడికించి నీటిని వార్చి పక్కన పెట్టుకోవాలి.
 7. ఒక బాణలిలో ఉల్లిపాయలను ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
 8. మిక్సీలో కొత్తిమీర పుదీనా తరుగు పచ్చిమిర్చి 2 వేసి గ్రైండ్ చేసుకోవాలి.
 9. ఒక పాత్రలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద మిగిలిన మసాలా దినుసులు ధనియాలపొడి బిర్యానీ మసాలా పెరుగు ఉప్పు టేస్టీంగ్ సాల్ట్ వేసి కోడి గుడ్లు వేసి ఒక 3ని వేయించి పక్కన పెట్టుకోవాలి.
 10. ఆ తర్వాత వేరొక పాత్రలో నెయ్యి వేసి ఉడికించిన బియ్యం వేయాలి ఆ తర్వాత వాటిపైన ఉడికించిన గుడ్డు మిశ్రమం వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు రంగు కలిపిన నిమ్మరసం అక్కడక్కడా వేసి మళ్ళీ ఇదే పద్ధతిని రెండు మూడు సార్లు రిపీట్ చేయాలి.
 11. చివరికి పైన నెయ్యి వేసి దానిపైన మూత పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా గట్టిగా సీల్ చేసి స్టౌ మీద చిన్న మంట మీద ఒక 10ని ఉడికించాలి.
 12. అంతే నండీ ఎంతో రుచికరమైన గుడ్డు బిర్యానీ రెడీ!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర