హోమ్ / వంటకాలు / సిరకు సిరాళం

Photo of SirakuSiralam by Rajeshwari Puthalapattu at BetterButter
373
5
0.0(0)
0

సిరకు సిరాళం

Mar-16-2018
Rajeshwari Puthalapattu
360 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సిరకు సిరాళం రెసిపీ గురించి

సీమ లో అల్పాహారం విశిష్టమైనది, ధాన్యములు ,దినుస్సులతో కూడిన అల్పాహారం రోజంతటికి సరిపడా శక్తినిస్తుంది , ఉగ్గని,ఇడ్లి,దోస,పొంగల్, నూక ఉప్మా, పొంగణాలు కాక సిరాళం చాలా విశిష్టమైనది, "పట్టు' వారి రుచుల లో ఈ మరుగున పడ్డ అల్పాహారాన్ని మీ ముందుకు తెస్తున్నా. తప్పకుండా చేసి రుచి చూడండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1. పచ్చి శెనగ పప్పు - 1 కప్పు,
  2. 2.గుండు మినప - 1కప్పు,
  3. 3.పచ్చి మిరపకాయలు - 4,
  4. 4.అల్లం : ఒక అంగుళం ముక్క
  5. 5.కరివేపాకు - 2 రెమ్మలు,
  6. 6.కారం పొడి - 1/4 చెంచా,
  7. 7.పసుపు - 1/4 చెంచా,
  8. 8.ఉప్పు - రుచి కి సరిపడా,
  9. 9.వంటసోద - చిటికెడు,
  10. 10.సిర్రాకు - సన్నగా తరిగిన రెండు కట్టలు
  11. 11. ఉల్లిపాయ - 1- సన్నగా తరిగినది
  12. 12. ఆవాలు - 1/4 చెంచా
  13. 13 మిన పప్పు -1 చెంచా,
  14. 14.నూనె - 2 చెంచాలు.

సూచనలు

  1. 1. పప్పులను కడిగి 6 గంటల పాటు సరిపడినన్ని నీళ్ల లో నాన పెట్టండి.
  2. 2.నానిన పప్పులకు మిరప కాయలు, అలం, ఉప్పు చేర్చి బరక గా గట్టి పిండిగా రుబ్బుకోండి.
  3. 3.రుబ్బిన పిండి కి కాస్త వంట సోడా, తరిగిన ఉలిపాయ, సిరాకు కలిపి ఉంచండి.
  4. 4.ఇపుడు ఇడ్లి పాత్రలకు నూనె రాసి పిండి అందులో వేసి ఇడ్లి లా ఉడికించండి.
  5. 5. ఉడికిన ఇడ్లి ని చల్లారాక చిన్న ముక్కలుగా తరగండి.
  6. 6. మూకుట్లో తాలింపు కి సరిపడా నూనె వేసి అందులో ఆవాలు వేయండి, చిటపట లాడాకా మినపప్పు వేయండి, వేగాక కరివేపు సిరాళం మూకలు వేసి వేపండి, ఇపుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసి కలపండి.
  7. వేడి వేడి సిరకు సిరాళం రెడీ. సీమ లో దొరికే ఈ ఆకు కూర కంటి చూపుకి మేలు చేస్తుంది, పప్పు దినులుసులు పౌష్టికాహారం, ఆకుకూరలు మంచి ఐరన్, కాల్షియమ్,పీచుపదార్థాలు కలిగిన అమృతం.ఈ రెండిటి ని కలిపి తక్కువ నూనె తో ఆవిరి మీద చేసే ఈ "సిరకు సిరాళం" అల్పాహారం ఆరోగ్యప్రదాయిని.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర