మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ | Lentils pan cake & Chutney Recipe in Telugu

ద్వారా Raghu Kumar Puranam  |  18th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lentils pan cake & Chutney recipe in Telugu,మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ, Raghu Kumar Puranam
మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీby Raghu Kumar Puranam
 • తయారీకి సమయం

  20

  గంటలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ వంటకం

మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lentils pan cake & Chutney Recipe in Telugu )

 • మినప పప్పు అర కప్పు
 • బియ్యం ఒకటిన్నర కప్పు
 • కొత్తిమీర తరుగు చేతి నిండా
 • పుదీనా తరుగు చేతి నిండా
 • జిలకర ఒక చెంచా
 • ఉప్పు తగినంత
 • వంట షోడా పావు చెంచాడు
 • పచ్చిమిర్చి ఆరు
 • పల్లీలు పావు కప్పు
 • పుట్నాలు పావు కప్పు
 • నీళ్ళు అవసరమైనంత
 • ఆవాలు జిలకర మినప పప్పు శనగపప్పు కరివేపాకు

మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ | How to make Lentils pan cake & Chutney Recipe in Telugu

 1. నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అర్థ కప్పు మినపప్పు ఒకటిన్నర కప్పు బియ్యం కడిగి నీళ్ళలో నానపెట్టి సాయంత్రం ఆరు గంటలకు నీళ్ళు ఓడ్చేసి ఒక సారి మరలా కడిగి గట్టిగా రుబ్బుకుని రాత్రంతా మూతపెట్టి పెట్టాలి. ఉదయం 6.00 గంటలకు దోసె పిండిలో తగిన ఉప్పు, కొంచెం వంటషోడా, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, జిలకర కలిపి తగిన నీళ్ళు పోసి దోసెలు పోసుకోవడానికి అనుకూలంగా జారుడుగా కలిపి పొయ్యి వెలిగించి పెనం పెట్టి పెనం వేడి ఎక్కాక ఉల్లి గడ్డ ముక్కతో గట్టిగా అదిమి పెనం మొత్తం రుద్ది ఒక గరిటెడు దోసె పిండి పెనం మీద పోసి గుండ్రంగా పరిచి అంచులకు నూనె వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చాలి. పచ్చిమిరప కాయలు,వేపి పొట్టు తీసిన పల్లీలు, పుట్నాలు, ఉప్పేసి రుబ్బుకుని పోపెట్టిన పచ్చడి. సూపరుగుంది.

Reviews for Lentils pan cake & Chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo