పనసపొట్టు ఆవ కూర | Jack fruit curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Jack fruit curry by Sree Vaishnavi at BetterButter
పనసపొట్టు ఆవ కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  13

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

పనసపొట్టు ఆవ కూర వంటకం

పనసపొట్టు ఆవ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jack fruit curry Recipe in Telugu )

 • పనస పొట్టు 3 కప్పులు
 • పచ్చిమిర్చి 4
 • చింత పండు పేస్టు 2 చెంచాలు
 • తగినంత ఉప్పు
 • చిటికెడు పసుపు
 • కరివేపాకు రెమ్మలు 2
 • సెనగ పప్పు 1 చెంచా
 • మినపపప్పు 1 చెంచా
 • ఆవాలు 1 చెంచా
 • ఎండు మిర్చి 2
 • ఆవ (ఆవాలు మిక్సీ చేసుకుని, పేస్టుగా మెత్తగా కలుపుకోవాలి)
 • నూనె 3 చెంచాలు
 • జీడిపప్పు 6

పనసపొట్టు ఆవ కూర | How to make Jack fruit curry Recipe in Telugu

 1. పనస పొట్టు బాగా ఊడక పెట్టి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి.
 2. బాణలిలో 2 చెంచాల నూనె వేసి కొంచెం కాగాకా ఎండు మిర్చి మరియు పోపు దినుసులు , పల్లీలు , జీడిపప్పు వెయ్యాలి.
 3. చిటికెడు పసుపు కరివేపాకు తరిగిన పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించి ఉంచాలి.
 4. తరువాత ఉడికించిన పనస పొట్టు + చింతపండు పేస్టు ఉప్పు వేయాలి.
 5. మూత ఉంచి తక్కువ వేడిపై 1 నిమిషం ఉంచి బాగా కలుపుకోవాలి.
 6. చల్లారాక కూరను దించి పైన చెప్పిన ఆవను బాగా కలిసేలా కలుపు కోవాలి.
 7. ఇందులో వేయించిన గుమ్మడికాయ ఒడియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది.

నా చిట్కా:

ఆవాలు నువ్వులు కలిపి కొంచెం నీరు పోసుకొని రుబ్బుకుంటే ఆవ తయారవుతుంది . వేడిగా వున్న వంటకం లో వేయకూడదు .

Reviews for Jack fruit curry Recipe in Telugu (0)