పాలకూర పప్పు | Palak pappu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  24th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak pappu recipe in Telugu,పాలకూర పప్పు, Tejaswi Yalamanchi
పాలకూర పప్పుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

పాలకూర పప్పు వంటకం

పాలకూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak pappu Recipe in Telugu )

  • కంది పప్పు పావు కిలో
  • పాలకూర కట్ట 1
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 2
  • ఒక్క స్పూన్ ఉప్పు
  • ఒకటిన్నర స్పూన్ కారం
  • టమోటా 1
  • పచ్చి శనగపప్పు ఒక స్పూన్
  • ఆవాలు 1/2 స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • కర్వేపాకు రెండు రెమ్మలు
  • నూనే 3 స్పూన్లు

పాలకూర పప్పు | How to make Palak pappu Recipe in Telugu

  1. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పును కడిగి దాంట్లో తరిగిన పాలకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా వేయండి
  2. దాంట్లో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వరకు ఉడికించండి
  3. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో ఆవిరి పోయాక దాంట్లో తగినంత ఉప్పు కారం వేసి కలపండి
  4. మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం నీరు పోసుకొని మళ్ళీ పొయ్యిమీద పెట్టుకోండి
  5. ఒక బాణీలో నూనె పోసుకొని అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు వేసి వేగాక ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికే పప్పు లో వేయండి
  6. ఒక రెండు నిముషాలు ఉడికాక దించేయండి

Reviews for Palak pappu Recipe in Telugu (0)