పాలకూర పప్పు | Spinach With Split Pegion Peas Recipe in Telugu

ద్వారా Suma Malini  |  8th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spinach With Split Pegion Peas recipe in Telugu,పాలకూర పప్పు, Suma Malini
పాలకూర పప్పుby Suma Malini
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

పాలకూర పప్పు వంటకం

పాలకూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach With Split Pegion Peas Recipe in Telugu )

 • లేత పాలకూర 2 కట్టలు
 • టమొట 1
 • పచ్చి చింతకాయలు 4
 • పండు మిర్చి 1
 • పాలు 50మిల్లీ
 • కందిపప్పు 50గ్రా
 • ఆవాలు అరస్పూన్
 • జిలకర్ర అరస్పూన్
 • ఇంగువ చిటికెడు లేదా వెల్లుల్లి 4 రేకులు
 • పసుపు చిటికెడు
 • వెన్న పూస అరస్పూన్

పాలకూర పప్పు | How to make Spinach With Split Pegion Peas Recipe in Telugu

 1. పాలకూర కడిగి శుభ్రం చేసుకుని సన్నగా తరుగుకోవాలి.
 2. కందిపప్పు కడిగి ఉడికించుకోవాలి.
 3. చింతకాయలు టమెటో కలిపి ఉడికించాలి.
 4. మూకుడులో వెన్న పూస వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి. పండు మిర్చి వేయించి తీయాలి.
 5. తరిగిన పాలకూర పోపులో వెయ్యాలి.
 6. పాలకూర వేగాక పాలు పోసి ఉడికించాలి.
 7. ఉడికించిన కందిపప్పు కలపాలి.
 8. ఉడికించిన చింతకాయలు టమెటో గింజలు, పెంకులు వేరుచేసి వేయించిన పండు మిర్చితో కలిపి రుబ్బి గుజ్జు పప్పు కు కలపాలి ‌
 9. చివరగా చిటికెడు ఇంగువ, పసుపు వేసి బాగా కలిపి మరోసారి ఉడికించి దింపేయాలి.
 10. ఈ వంటకం లో పాలు, పాలకూర లోని సహజంగా సోడియం ఎక్కువ గా ఉంది. ఉప్పు అవసరం ఉండదు. కారంని బట్టి రుచి చూసి ఉప్పు తగినంత వేసుకోవాలి.

నా చిట్కా:

హై బిపి వల్ల ఉప్పు నూనెలు తినకూడని వాళ్ళకు రుచి కరమైన ఆరోగ్య కరమైన ఆహారం.

Reviews for Spinach With Split Pegion Peas Recipe in Telugu (0)