హోమ్ / వంటకాలు / సొరకాయ పాలు కూర

Photo of Sorakaya paalu curry by Ram Ram at BetterButter
507
2
0.0(0)
0

సొరకాయ పాలు కూర

May-10-2018
Ram Ram
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ పాలు కూర రెసిపీ గురించి

సొరకాయ ఎన్నో పోషక విలువలు కలియున్న కూరగాయ. లేత పసుపు ఆకు పచ్చ రంగు లో ఉండే కూరగాయ లో కాల్షియమ్,ఫాస్ఫరస్,విటమిన్బ్,బి కాంప్లెక్స్ పోషకాలు విరివిగా లభిస్తాయి. ఈ కూరగాయ బరువు తగ్గడం లో కూడా సహాయ పడుతుంది.ఈ కూరగాయ వండటం కూడా మహా తేలిక ఇందులోని నీరు కారణంగా సులువుగా ఉడికిపోతుంది. ఈ కూరని అన్నం తో నైనా చపాతి తో అయినా తినవచ్చును.పాలు పోసుకోవటం వలన రుచి లో కూడా మహా కమ్మగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సొరకాయ చిన్నది
  2. పాలు చిన్న గ్లాస్
  3. తలింపుదినుసులు కొద్దిగా(ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు వెల్లులి)
  4. ఉప్పు సరిపడా
  5. పసుపు 1/2 చెంచా
  6. పచ్చిమిర్చి 1
  7. నూనె 2 చెంచాలు
  8. కొత్తిమీర కొద్ధిగా

సూచనలు

  1. సొరాకాయని పొత్తు తీసి ముక్కలాగా చేసుకోండి ఆ పైన ముక్కల్ని నీళ్లు వేసి ఉడికించుకుని దానిలో పసుపు, ఉప్పు , పచ్చిమిరపకాయ వేసి ఉడికించుకోవాలి
  2. తరువాత ఒక పాన్ లో నూనె వేసి ఆవల,జీలకర్ర ,వెల్లులి రెబ్బలు ,మినా పప్పు , కరివేపాకు వేసి తాలింపు చేసుకొని అందులో ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేసి పాలు పోసి దగ్గర పడనివ్వాలి.
  3. చివరిలో తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోండి. అంతే ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పాలు పోసిన కూర రెడీ.
  4. 2.boil ayyina mukkalni talimpulo vesi.. milk add chesi daggara padanivvali.. finalga kothimeera add chesukovali..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర