తీపి గులాబిపువ్వులు | Sweet roses Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet roses recipe in Telugu,తీపి గులాబిపువ్వులు, Sree Vaishnavi
తీపి గులాబిపువ్వులుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

తీపి గులాబిపువ్వులు వంటకం

తీపి గులాబిపువ్వులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet roses Recipe in Telugu )

 • పాలు 1 కప్
 • పంచదార 1 కప్
 • నెయ్యి 2 చెంచాలు
 • బెకింగ్ పౌడర్ 1 చెంచా
 • మైదా పిండి 2 కప్పులు
 • నూనె వేయించటానికి సరిపడా

తీపి గులాబిపువ్వులు | How to make Sweet roses Recipe in Telugu

 1. ముందుగా ఒకగిన్నెలొ 1కప్ పాలు కాచుకోవాలి
 2. అందులొ 1కప్ పంచదార వేసి కరిగించాలి
 3. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి
 4. 1స్పూన్ బెకింగ్ పౌడర్ వేసి అందులోనే 2 లేదా 3 కప్పుల మైదా పిండి వేసి చపాతిపిండిలా బాగా కలిసాక స్టొవ్ ఆపివేయాలి.
 5. ఆ తర్వాత పిండి చల్లారాక చపాతిలా వత్తుకోవాలి
 6. గుండ్రముగా కత్తిరించి మూడిటిని ఒకదానిమీద ఒకటి పెట్టి 4 వైపులా కత్తిరించాలి
 7. మధ్యలో వేలుతో నొక్కి మదవాలి. అలా అన్ని గులాబిలా మదవాలి .
 8. బాండిలొ నూనె వేసుకొని మీడియం ఫ్లెంలో వేయించుకోవాలి. బంగారం రంగులోకి వచ్చెటట్టు వేయిచాలి
 9. ఎంతో అందమైన రుచికరమైన తీయ్యతియ్యని గులాబిపూలు రడీ.

నా చిట్కా:

నచ్చితే రంగులు వేసుకోవచ్చు

Reviews for Sweet roses Recipe in Telugu (0)