కరకర మసాలా శెనగలు | Crispy Roasted Masala Chick Peas Recipe in Telugu

ద్వారా Suma Malini  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Crispy Roasted Masala Chick Peas recipe in Telugu,కరకర మసాలా శెనగలు, Suma Malini
కరకర మసాలా శెనగలుby Suma Malini
 • తయారీకి సమయం

  6

  గంటలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

కరకర మసాలా శెనగలు వంటకం

కరకర మసాలా శెనగలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crispy Roasted Masala Chick Peas Recipe in Telugu )

 • కాబోలి షశెనగలు 1 కప్పు
 • ధనియాలు 1 చెంచా
 • పసుపు 1/2 చెంచా
 • అల్లం 1/2 అంగుళం
 • వెల్లుల్లి 5 రెబ్బలు
 • పసుపు ఒక చిటికెడు
 • ఉల్లిపాయ ముక్కలు లేదా కాడలు 2 చెంచాలు
 • టమోటో సగం

కరకర మసాలా శెనగలు | How to make Crispy Roasted Masala Chick Peas Recipe in Telugu

 1. కాబూలి శెనగలు సరిపడా నీళ్లు పోసి రాత్రంతా లేదా రెండింతలు అయ్యే వరకు నానబెట్టాలి.
 2. టమొటో, ధనియాలు, పసుపు, ఉల్లి కాడలు, అల్లం, వెల్లుల్లి,పండు మిర్చి పేస్ట్ వేసి మెత్తగా మసాలా ముద్దని రుబ్బుకోవాలి.
 3. రుబ్బిన మసాలాని శెనిగలకు పట్టించాలి.
 4. వీటిని ఆవిరి పట్టాలి. వీటికి వెన్న పూస పట్టించి 10 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టాలి.
 5. ఫ్రిజ్లో పెట్టిన శెనగలని ఎయిర్ ఫ్రైర్ లో 20 నిమిషాలు పాటు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో , 10 నిమిషాలు పాటు 200 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర పడేంతవరకు వేయించాలి.
 6. ఎయిర్ ఫైయర్ కట్టేసి చల్లారాక కర కర లాడే శెనగలు రడీ‌.
 7. వీటిని ఇలాగే తినొచ్చు లేదా ఉల్లి తరుగు,చాట్ మసాలా చల్లుకొని వడ్డించాలి.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం !

నా చిట్కా:

శెనగలు లాగానే పచ్చి బఠాణీలు, దేశవాళీ శెనగలు,అలచందలు,పెసలు కూడా చేసుకోవచ్చు. చాయపప్పులు కూడా ఇలాగే చేసుకోవాలి.

Reviews for Crispy Roasted Masala Chick Peas Recipe in Telugu (0)